Raja: ఎంపీగారు అంతమాట అనేశారేంటో... దేవుడిపై నాకెలాంటి కోపం లేదు!
ABN , Publish Date - Apr 02 , 2024 | 10:22 AM
హిందూ మతంపై తరచూ విమర్శలు చేసి వివాదాల్లో చిక్కుకునే డీఎంకే సిట్టింగ్ ఎంపీ ఎ.రాజా(MP A. Raja) ఇటీవల శ్రీరాముడిని మేమెప్పుడూ అంగీకరించం అంటూ వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు.
- డీఎంకే నేత రాజా
చెన్నై: హిందూ మతంపై తరచూ విమర్శలు చేసి వివాదాల్లో చిక్కుకునే డీఎంకే సిట్టింగ్ ఎంపీ ఎ.రాజా(MP A. Raja) ఇటీవల శ్రీరాముడిని మేమెప్పుడూ అంగీకరించం అంటూ వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించారు. అంతటితో ఆగకుండా శ్రీరాముడికి మేం శ్రతువులం అంటూ ప్రకటించారు. ఈ మాటలు బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ కూడా కాస్త ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలో కున్నూరులో ఏర్పాటైన ప్రచార సభలో ఎ.రాజా మాట్లాడుతూ... తన సతీమణి శ్రీరాముడి భక్తురాలని, ప్రతి శనివారం రామాలయానికి వెళ్లేదని, గురువారం తన కోసం, సోమవారం పరమేశ్వరుడి కోసం వ్రతమాచరించేందని, ఆమె పూజ గది ఇంకా పదిలంగా ఉందని చెప్పారు. ఆ పూజగదిలో ఏ రోజూ తాను అడుగుపెట్టలేదన్నారు. దేవుడిపై ఆమెకు నమ్మకం ఉన్నా తనకు నమ్మకం లేదని, సభకు విచ్చేసిన వారిలో చాలా మందికి దైవ నమ్మకం ఉందనే విషయం తనకు తెలుసునని చెప్పారు. దేవుడిపై తనకెలాంటి కోపం లేదని, కల్లాకపటం లేని మనస్సే దేవుడని, పేదల చిరునవ్వుల్లోనే దేవుడిని చూడగలమనే ద్రావిడ నేతల మాటలే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.
ఇదికూడా చదవండి: Khushboo: ఇంతలోనే అంత మార్పా.. మనసు మార్చుకున్న ఖుష్బూ.. 4 నుంచి ఎన్డీయేకి మద్దతుగా ప్రచారం