Share News

Ayodhy Ram Mandir: రాహుల్ నోట అదే పాత పాట..

ABN , Publish Date - Jan 16 , 2024 | 03:41 PM

కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' నాగాలాండ్‌ రాజధాని కోహిమాకు సోమవారం సాయంత్రం చేరుకుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరోసారి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంపై తమ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. జనవరి 22 జరిగే కార్యక్రమం 'ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం' అని అన్నారు.

Ayodhy Ram Mandir:  రాహుల్ నోట అదే పాత పాట..

కోహిమా: కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra) నాగాలాండ్‌ (Nagaland) రాజధాని కోహిమాకు సోమవారం సాయంత్రం చేరుకుంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరోసారి అయోధ్య రామాలయ (Ayodhya Ram Temple) ప్రారంభోత్సవ కార్యక్రమంపై తమ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు. జనవరి 22 జరిగే కార్యక్రమాన్ని 'ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యక్రమం'గా అభివర్ణించారు.


''జనవరి 22న జరిగే కార్యక్రమాన్ని పూర్తిగా నరేంద్ర మోదీ కార్యక్రమంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ రూపొందించింది. ఆ కారణంగానే మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలు, మతాచారాలను గౌరవిస్తుంది. 22వ తేదీన జరిగే కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా హిందూ మతానికి చెందిన పెద్దపెద్ద సంస్థలు సైతం తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ చుట్టూ, ఆర్ఎస్ఎస్ చుట్టూ డిజైన్ చేసిన ఈ కార్యక్రమం రాజకీయ కార్యక్రమమైనందునే మేము పాల్గొనలేకున్నాం'' అని రాహుల్ తెలిపారు.


కోట్లాది మంది రామభక్తుల మనోభావాలను, సుప్రీంకోర్టు తీర్పును తాము గౌరవిస్తు్న్నామని, అయితే రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ కార్యక్రమంగా మార్చినందున రామమందిర ఆహ్వానాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీపీపీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభలో పార్టీ విపక్ష నేత అధీర్ రంచన్ చౌదరి గత బుధవారంనాడు ప్రకటించారు.

Updated Date - Jan 16 , 2024 | 03:52 PM