Share News

Ration cards: 14,082 బీపీఎల్‌ కార్డుల రద్దు

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:14 PM

బీపీఎల్‌(బిలో పావర్టీ లైన్‌) రేషన్‌ కార్డుల(Ration cards) ఏరివేతలో భాగంగా బళ్లారి, విజయనగర జిల్లాల్లో అనర్హులుగా గుర్తించి 14,082 మంది కార్డులు రద్దు చేశారు. బళ్లారి జిల్లాలో మొత్తం 12,950 మంది అనర్హులు బీపీఎల్‌ కార్డులు పొందినట్లు గుర్తించి, రద్దు చేసినట్లు ఆహార పౌరసరఫరా అధికారులు తెలిపారు.

Ration cards: 14,082 బీపీఎల్‌ కార్డుల రద్దు

- బళ్లారిలో 12,950, విజయనగర జిల్లాలో 1,132

- దాదాపు మూడు వేల కార్డులు ఏపీఎల్‌గా మార్పు

బళ్లారి(బెంగళూరు): బీపీఎల్‌(బిలో పావర్టీ లైన్‌) రేషన్‌ కార్డుల(Ration cards) ఏరివేతలో భాగంగా బళ్లారి, విజయనగర జిల్లాల్లో అనర్హులుగా గుర్తించి 14,082 మంది కార్డులు రద్దు చేశారు. బళ్లారి జిల్లాలో మొత్తం 12,950 మంది అనర్హులు బీపీఎల్‌ కార్డులు పొందినట్లు గుర్తించి, రద్దు చేసినట్లు ఆహార పౌరసరఫరా అధికారులు తెలిపారు. ఇందులో ఆదాయ పన్ను చెల్లించే కుటుంబాలు 1,772 ఉన్నాయని, వారి కార్డులను ఏపీఎల్‌గా మార్పు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘కుటుంబ’ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ఆదాయ పన్ను చెల్లింపు దారులు, ప్రభుత్వ ఉద్యోగులు, సంవత్సరా దాయం రూ. 1.2లక్షలకు పైబడిన వారిని అనర్హులుగా గుర్తించి, కార్డులు రద్దు చేసినట్లు తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: రూ. వెయ్యికోట్లు ఇచ్చినా బీజేపీలో చేరేది లేదు..


బళ్లారి(Ballary) జిల్లాలో తాలూకా వారిగా పరిశీలిస్తే, బళ్లారి తాలూకా 5,431 మంది అనర్హులు వద్ద బీపీఎల్‌ కార్డులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో 21 కార్డులు రద్దు చేయగా, మిగతా వాటి రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. బళ్లారి గ్రామీణ ప్రాంతాల్లో 22 కార్డులు, కంప్లి 1,242 కార్డులు గుర్తించగా, వాటిలో ఇప్పటి వరకు 83 కార్డులు రద్దయ్యాయి. కురుగోడులో 348 కార్డులు, సండూరులో 2,775, సిరుగుప్ప 1,454 అనర్హుల వద్ద బీపీఎల్‌ కార్డులు ఉన్నట్లు తేలిందన్నారు. జిల్లాలో 71మంది ప్రభుత్వ ఉద్యోగులు బీపీఎల్‌ కార్డులు పొందగా, ప్రస్తుతం వాటిని ఏపీఎల్‌ కార్డుగా మార్పు చేసినట్లు తెలిపారు.


బళ్లారి తాలూకాలో 30, బళ్లారి రూరల్‌ 6, కురుగోడు 3, సండూరు 14, సిరుగుప్పలో 13మంది ప్రభుత్వ ఉద్యోగుల వద్ద బీపీఎల్‌ కార్డులు ఉన్నట్లు ఆహార పౌరసరఫరా శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2012-2024 మధ్య కాలంలో 2,813మంది అనర్హుల వద్ద బీపీఎల్‌ కార్డులు ఉన్నట్లు గురించి వారి నుంచి జరిమానా వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మృతి చెందిన వారిపేరుపై 3,576 కార్డులు ఉన్నట్లు గుర్తించి, రద్దు చేసినట్లు తెలిపారు. ఒక్క బళ్లారి నగరంలోనే 1,556 ఇలాంటి కార్డులను గుర్తించారు. కంప్లిలో 341, కురుగోడు 282,సండూరు 89, సిరుగుప్పలో 808 మృతిచెందిన వారిపై ఉన్న కార్డులు రద్దు చేశారు.


ఆరు నెలలు రేషన్‌ పొందని కార్డులు సస్పెన్షన్‌

జిల్లాలో బీపీఎల్‌ కార్డులు ఉన్న వారు వరుసగా ఆరు నెలల పాటు చౌకధరల ధాన్యం డిపోల నుంచి సరుకులు తీసుకోకపోతే వారి కార్డులు సస్పెండ్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాంటివి ఇప్పటి వరకు 7488 కార్డులను సస్పెండ్‌ చేసినట్లు వెల్లడించారు. రేషన్‌ పొందక పోవడానికి సరైన కారణాలు చూపి ఆధారాలు అందజేస్తే సస్పెన్షన్‌ తొలగిస్తామని చెప్పారు.


విజయనగర జిల్లాలో 1132 బీపీఎల్‌ కార్డుల రద్దు

విజయనగర జిల్లాలో 1132 అనర్హుల కార్డులను రద్దు చేసినట్లు ఆహార పౌరసరఫరా అధికారులు పేర్కొన్నారు. ఆరు నెలలుగా రేషన్‌ పొందని 9,326 కార్డులను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. వీరితో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న 101 మంది, ఆదాయ పన్ను చెల్లించే 1,031 మంది బీపీఎల్‌ కార్డులను ఏపీఎల్‌గా మార్చినట్లు తెలిపారు. సుమారు మూడు నెలల పాటు జిల్లాలో కార్డుల ఏరివేత కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ క్యాడర్‌ ప్రాసిక్యూటర్ల సంఘం అధ్యక్షుడిగా రాంరెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Midday Meal: మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌

ఈవార్తను కూడా చదవండి: TET: ముగిసిన టెట్‌ గడువు..22 వరకు ఎడిట్‌ ఆప్షన్‌

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: సీఎం రేవంత్ పర్యటన.. రోడ్డెక్కిన దళిత సంఘాల నాయకులు..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2024 | 01:14 PM