Share News

వాస్తవాధీన రేఖ వెంబడి సేనలు వెనక్కి!

ABN , Publish Date - Oct 26 , 2024 | 02:28 AM

నాలుగేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ సరిహద్దుల్లో గస్తీపై భారత్‌, చైనా మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం అమలు విషయంలో ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి..

వాస్తవాధీన రేఖ వెంబడి సేనలు వెనక్కి!

  • 2020 ఏప్రిల్‌ ముందు నాటి స్థానాలకు

  • భారత్‌, చైనా బలగాలు.. ఒప్పందం అమలు

న్యూఢిల్లీ, అక్టోబరు 25: నాలుగేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ సరిహద్దుల్లో గస్తీపై భారత్‌, చైనా మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం అమలు విషయంలో ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి.. తూర్పు లద్ధాఖ్‌లో కీలక ప్రాంతాలైన డెమ్చోక్‌, డెస్పాంగ్‌లో ఉంచిన సేనలను ఇరుదేశాలు వెనక్కి రప్పిస్తున్నాయి. 2020 ఏప్రిల్‌కు ముందు(గల్వాన్‌ లోయలో ఘర్షణలకు ముందు) సేనలు ఎక్కడ ఉండేవో అక్కడికి తిరిగి చేరుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా వాస్తవాధీన రేఖకు ఇరువైపులా ఉన్న 12 తాత్కాలిక నిర్మాణాలు, 12 గుడారాలను ఆయా సైన్యాలు తొలగించాయి. చైనా ఆర్మీ తమకు చెంది న కొన్ని వాహనాలను వెనక్కి తీసుకెళ్లగా, భారత ఆర్మీ కొంత సైన్యాన్ని వెనక్కి రప్పించింది.

చార్డింగ్‌ నుల్లా నదికి పశ్చిమ దిశగా భారత బలగాలు, తూర్పు వైపుగా చైనా సైన్యం వెనక్కి వెళుతోంది. బలగాల ఉపసంహరణ ప్రక్రియ 29వ తేదీ వరకు కొనసాగనుంది. మరో నాలుగైదు రోజుల్లో డెమ్చోక్‌, డెస్పాంగ్‌ ప్రాంతాల్లో గస్తీ తిరిగి ప్రారంభమవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, గల్వాన్‌ సహా నాలుగు ప్రాంతాల్లో సైనిక ఉపసంహరణపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Oct 26 , 2024 | 02:28 AM