Share News

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉపఎన్నికల్లో రేఖాశర్మ ఏకగ్రీవ ఎన్నిక

ABN , Publish Date - Dec 13 , 2024 | 06:22 PM

హర్యానా నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థిగా రేఖాశర్మ నిలబడ్డారు. రేఖాశర్మకు పోటీగా ఎవరూ నామిషన్ వేయకపోవడంతో ఆమె గిలిచినట్టు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉపఎన్నికల్లో రేఖాశర్మ ఏకగ్రీవ ఎన్నిక

చండీగఢ్: జాతీయ మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ రేఖా శర్మ (Rekha Sharma) హర్యానా (Haryana) నుంచి రాజ్యసభకు జరిగిన ఉపఎన్నికలో శుక్రవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హర్యానా నుంచి బీజేపీ అభ్యర్థిగా రేఖాశర్మ నిలబడ్డారు. రేఖాశర్మకు పోటీగా ఎవరూ నామిషన్ వేయకపోవడంతో ఆమె గిలిచినట్టు చండీగఢ్ రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని ఆమెకు అందజేశారు.

PM Modi: Kumbha Mela: 'ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం' స్ఫూర్తితో మహా కుంభమేళా


ప్రజాగళం వినిపిస్తా

రాజ్యసభ ఉపఎన్నికల్లో గెలుపుపై రేఖాశర్మ మాట్లాడుతూ, ప్రజావాణిని రాజ్యసభలో వినిపించడానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. తాను మహిళా కమిషన్ నుచి వచ్చారని, అక్కడ తొమ్మిదేళ్ల పాటు తాను పనిచేశానని చెప్పారు. మహిళా సాధికారతకు తాను చేయాల్సినదంతా చేస్తానని తెలిపారు.


షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న రాజ్యసభ ఉపఎన్నికలు జరగాల్సి ఉండగా, హర్యానా నుంచి తమ అభ్యర్థిగా రేఖాశర్మను బీజేపీ ప్రకటించింది. పోటీ లేకపోవడంతో ఆమె ఎన్నికను రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తూ గెలుపు పత్రాన్ని ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు హర్యానా మంత్రి మహిపాల్ దాండ, మాజీ అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ర గుప్తా హాజరయ్యారు. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో బీజేపీ 48 మంది సభ్యులతో మెజారిటీ ఉంది. కాంగ్రెస్‌కు 37, ఐ‌ఎన్ఎల్‌డీకి ఇద్దరు సభ్యుల బలం ఉండగా, ముగ్గురు ఇండిపెండెట్లుగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థులు నయబ్ సింగ్ సైని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. బీజేపీకి చెందిన కృష్ణలాల్ పవార్ గత అక్టోబర్‌లో అసెంబ్లీకి ఎన్నిక కావడంతో ఆయన రాజ్యసభ సీటును వదులుకున్నారు. దాంతో ఖాళీ అయిన ఆయన స్థానంలో రాజ్యసభకు ఉపఎన్నిక జరిగింది.


ఇది కూడా చదవండి..

Mumbai: షిర్డీ ఆలయ భద్రతపై మాక్‌ డ్రిల్‌

Sadhguru: సంపద సృష్టికర్తలను వివాదాల్లోకి లాగొద్దు

For National news And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 06:30 PM