Exit Polls 2024: రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు.. ఆ కూటమిదే ఘనవిజయం!
ABN , Publish Date - Jun 01 , 2024 | 07:03 PM
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. జూన్ 1వ తేదీన సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చేశాయి. మూడోసారి కూడా..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఆ సమయం రానే వచ్చేసింది. జూన్ 1వ తేదీన సాయంత్రం ఎగ్జిట్ పోల్ ఫలితాలు (Exit Poll Results) వచ్చేశాయి. మూడోసారి కూడా బీజేపీ నేతృత్వంలోనే ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధిస్తుందని, కేంద్రంలో అధికారంలోకి రానుందని రిపబ్లిక్ టీవీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 359 స్థానాల్లో గెలుస్తుందని ఆ ఏజెన్సీ తెలిపింది.
ఇక ఇండియా కూటమికి కేవలం 159 సీట్లే వస్తాయని, ఇతర పార్టీలు 30 వరకు సీట్లు సొంతం చేసుకుంటాయని ఆ సర్వే పేర్కొంది. ఎప్పట్లాగే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ చక్రం తప్పిందని.. దక్షిణాదిలో తన ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ, గతంతో పోలిస్తే చెప్పుకోదగ్గ స్థానాల్లో బీజేపీ నెగ్గిందని ఆ సర్వే వెల్లడించింది. ఏదేమైనా.. ముందు నుంచి చెప్తున్నట్టు బీజేపీ ఈసారి అఖండ విజయాన్ని సొంతం చేసుకోబోతోందని రిపబ్లిక్ టీవీ జోస్యం చెప్పింది.
రిపబ్లిక్ మ్యాట్రిజ్ కూడా ఎన్డీఏదే అధికారమని తెలిపింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ 353-368 మేర సీట్లు సొంతం చేసుకుంటుందని పేర్కొంది. కానీ.. ఇండియా కూటమికి కేవలం 118-133 స్థానాలు వస్తాయని.. ఇతర పార్టీలు 43-48 స్థానాల్ని సొంతం చేసుకుంటాయని వెల్లడించింది. తాము చెప్పినట్లుగానే.. బీజేపీ గతంతో కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది, అధికారంలోకి రానుందని చెప్పుకొచ్చింది.
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్:
ఎన్డీఏ - 359
ఇండియా - 159
ఇతరాలు - 30
రిపబ్లిక్ మ్యాట్రిజ్
ఎన్డీఏ - 353-368
ఇండియా - 118-133
ఇతరాలు - 43-48
Read Latest National News and Telugu News