Share News

TMC: కౌన్సిలర్ చేతిలో యూత్ ప్రెసిడెంట్‌కి చెంపదెబ్బలు

ABN , Publish Date - Jul 16 , 2024 | 08:39 PM

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీలోని నేతలు ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. మొన్న సందేశ్‌కాలీ, నిన్న చోప్రా.. నేడు కోల్‌కతా మహానగరం.

TMC: కౌన్సిలర్ చేతిలో యూత్ ప్రెసిడెంట్‌కి చెంపదెబ్బలు
TMC Leader Sunanda Sarkar

కొల్‌కతా, జులై 16: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీలోని నేతలు ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. మొన్న సందేశ్‌కాలీ, నిన్న చోప్రా.. నేడు కోల్‌కతా మహానగరం. తాజాగా కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్‌లో 18వ వార్డ్ కౌన్సిలర్‌ సునంద సర్కార్.. అదే వార్డులో పార్టీ యువజన అధ్యక్షుడు కేథార్ దాస్‌ చెంపలు పగలకొట్టింది. అందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీంతో మరోసారి మమతా బెనర్జీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లు అయింది.

Also Read: Narayan Gangaram Surve House: ఎల్‌ఈడీ టీవీ చోరీ చేశాడు.. మళ్లీ తిరిగి ఇంట్లో పెట్టేశాడు.. ఎందుకంటే..?

Also Read: Doda encounter: దోడా ఘటన.. తమ పనే: కశ్మీర్ టైగర్స్ ప్రకటన

Also Read: justice narasimha reddy: సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం


అయితే ఈ వీడియోపై అటు బీజేపీ, సీపీఐ(ఎం) స్పందించాయి. ఈ ఘటనను ఆ యా పార్టీలు తీవ్రంగా ఖండించాయి. ఇది అధికార పార్టీలో పుట్టిన అంతర్గత తెగులుగా బీజేపీ అభివర్ణించింది. సునందా సర్కార్‌పై అవినీతి ఆరోపణల వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ పార్టీ విశ్వసనీయత దెబ్బతిందన్నారు. అలాగే సునందా సర్కార్‌తోపాటు ఆమె అనుచరులుపై అక్రమార్జన కేసులు నమోదు చేయాలని సొంత పార్టీలోని నేతలే బట్టాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారంటే.. ఆ పార్టీలోని అంతర్గత సంక్షోభాన్ని సూచిస్తుందని బీజేపీ ఎక్స్ వేదికగా వివరించింది.

Also Read: Chandrababu Govt: జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Also Read:Notices To Ex MPs: 200 మందికి పైగా మాజీ ఎంపీలకు నోటీసులు

Also Read:Doda encounter: ప్రభుత్వమే బాధ్యత వహించాలి


ఇక సీపీఐ(ఎం) పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం స్పందిస్తూ.. ఇది స్ట్రీట్ జస్టీస్ అని పేర్కొన్నారు. మరోవైపు తమ పార్టీలోని నేత.. మరో నేతపై దాడి చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. ఈ ఘటన దురదృష్ణకరమన్నారు. పార్టీలోని సీనియర్ నేతలతోపాటు ప్రజా ప్రతినిధులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం చాలా దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 16 , 2024 | 08:39 PM