Jammu Kashmir: ఎన్నికల ప్రకటనకు ముందు రాష్ట్రంలో కీలక పరిణామాలు
ABN , Publish Date - Aug 16 , 2024 | 04:14 PM
దాదాపు 200 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 88 మంది ఐఏఎస్, కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను బదిలీ చేసింది. అలాగే 33 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరంతా ఐజీల నుంచి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్థాయి అధికారులను బదిలీ చేసింది.
శ్రీనగర్, ఆగస్ట్ 16: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం ప్రకటన చేసింది. అలాంటి వేళ.. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతకు ఒక రోజు ముందు.. అంటే ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఆగస్ట్ 15వ తేదీ.. భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ..
దాదాపు 200 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో 88 మంది ఐఏఎస్, కాశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారులను బదిలీ చేసింది. అలాగే 33 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసింది. వీరంతా ఐజీల నుంచి సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు స్థాయి అధికారులను బదిలీ చేసింది.
Also Read: Kolkata doctor case: మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడ్డ కోల్‌కతా హైకోర్టు
స్పందించిన ఒమర్ అబ్దుల్లా..
రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీపై నేషనల్ కాన్ఫరేన్స్ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా శుక్రవారం శ్రీనగర్‌లో స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడే కొన్ని గంటల ముందు.. ఇలా ఉన్నతాధికారుల బదిలీ చేయడం ఏమిటని ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఈ ఉన్నతాధికారుల బదిలీపై సమీక్షించాలని ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒమర్ అబ్దుల్లా విజ్జప్తి చేశారు.
Also Read:Raksha Bandhan 2024: రాఖీ పౌర్ణమి.. శుభ ముహూర్తం ఎప్పుడంటే..? ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కట్టాలంటే..?
ఈ బదిలీల వెనుక లెఫ్టినెంట్ గవర్నర్ హస్తం..
ఈ ఉన్నతాధికారుల బదిలీ వెనుక జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నారని ఒమర్ అబ్దుల్లా కుండ బద్దలు కొట్టారు. అలాగే ఎన్నికల షెడ్యూల్ వెలువడే ఒక రోజు ముందు.. అదీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. ఇలా ఉన్నతాధికారులను బదిలీ చేయడం వెనుకనున్న అంతర్యం ఏమిటో తనకు అర్థం కావడం లేదన్నారు. ఏదీ ఏమైనా జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో స్వేచ్చగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఒమర్ అబ్దుల్లా సూచించారు.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న..
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఈ రాష్ట్రంలో సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలో ఉన్నతాధికారుల బృందం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించింది. అలాగే అసెంబ్లీ ఎన్నికల అంశాలపై ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం రాష్ట్రంలోని శాంతి భద్రతలపై కేంద్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో సీఈసీ ఇటీవల సమావేశమై చర్చింది.
కొన్ని గంటలకే కీలక ప్రకటన...
ఈ సమావేశం అనంతరం కొన్ని గంటలకే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. అలాగే ఈ ఏడాది జూన్ 9వ తేదీ నుంచి రాష్ట్రంలో ఉగ్రవాద దాడులు గణనీయంగా పరిగాయి. దీంతో ఆ దాడులను శాశ్వత నిర్మూలించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారులు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. అందులోభాగంగా రాష్ట్రంలో ఉగ్రవాదుల చర్యలను ఉక్కుపాదంతో అణిచివేయాలని జమ్మూ కశ్మీర్ ఉన్నతాధికారులకు సూచించారు.
ప్రస్తుతం అడిషనల్ డీజీపీగా నళిన్ ప్రభాత్..
అలాగే ఆ రాష్ట్ర డీజీపీగా ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐపీఎస్ నళిన్ ప్రభాత్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం నియమించింది. అయితే ఆయన ఆక్టోబర్ 1వ తేదీన ఆ రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటి వరకు అదనపు డీజీపీగా ఆయన కొనసాగుతారని ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ జారీ చేసిన ఆదేశాల్లో స్పష్టం చేసింది.
Read More National News and Latest Telugu News