Share News

RSS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంతాపం

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:18 AM

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు నివాళులు అర్పిస్తూ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ సింగ్ సహకారం ఎప్పటికీ గుర్తుంటుందని సంఘ్ పేర్కొంది.

RSS: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంతాపం
RSS Condolences Manmohan Singh

దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) గురువారం (డిసెంబర్ 26, 2024) ఢిల్లీ ఎయిమ్స్‌లో తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలతోపాటు ప్రతిపక్షాలు కూడా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ప్రధాని మృతి పట్ల ఆర్‌ఎస్‌ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ సంతాపం వ్యక్తం చేశారు. భారత మాజీ ప్రధాని, దేశ సీనియర్ నేత డాక్టర్ సర్దార్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల యావత్ దేశం తీవ్ర విషాదంలో మునిగిపోయిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు చెప్పారు.


డాక్టర్ మన్మోహన్ సింగ్ సాధారణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ దేశంలో అత్యున్నత పదవిని స్వీకరించారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ సహకారం, భారతదేశానికి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మకు మోక్షాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఏడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించింది. ఈ సమయంలో జాతీయ జెండాను క్రమం తప్పకుండా ఎగురవేస్తారు. భారతదేశంలోని అన్ని ప్రదేశాలలో త్రివర్ణ పతాకం సగం మాస్ట్‌లో ఉంచుతారు. జాతీయ సంతాప సమయంలో అధికారిక వినోద కార్యక్రమాలు ఉండవు. అంత్యక్రియలు జరిగే రోజు విదేశాల్లోని అన్ని భారత రాయబార కార్యాలయాల్లోనూ జాతీయ జెండాను అర మాస్ట్‌లో ఎగురవేస్తామని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.


మన్మోహన్ సింగ్ మృతిపై ప్రధాని మోదీ

మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, భారతదేశానికి చెందిన అత్యంత విశిష్ట నాయకులలో ఆయన ఒకరని పేర్కొన్నారు. దేశ ఆర్థిక విధానంపై లోతైన ముద్ర వేశారని గుర్తు చేశారు. ఆర్థిక మంత్రితో సహా వివిధ ప్రభుత్వ పదవుల్లో పనిచేశారని మోదీ అన్నారు.


ఇవి కూడా చదవండి:

Manmohan Singh Net Worth: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 27 , 2024 | 11:27 AM