RSS annual Meet: నాగపూర్‌లో అఖిల భారతీయ ప్రతినిధి సభ..ఎజెండా ఏమిటంటే?
ABN , Publish Date - Feb 21 , 2024 | 08:21 PM
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశం నాగపూర్‌లో మార్చి 15,16,17 తేదీల్లో జరుగనుంది. ఈ ఏడాది ఆర్ఎస్ఎస్ అఖిల్ భారతీయ ప్రతినిధి సభ నాగపూర్‌లో మూడ్రోజుల పాటు జరపనున్నట్టు ఆర్ఎస్ఎస్ అఖిల్ భారతీయ ప్రచార్ ప్రముఖ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎజెండాను ఈ కీలక సమావేశాల్లో నిర్ణయిస్తామని చెప్పారు.
నాగపూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వార్షిక సమావేశం నాగపూర్ (Nagapur)లో మార్చి 15,16,17 తేదీల్లో జరుగనుంది. ఈ ఏడాది ఆర్ఎస్ఎస్ అఖిల్ భారతీయ ప్రతినిధి సభ నాగపూర్‌లో మూడ్రోజుల పాటు జరపనున్నట్టు ఆర్ఎస్ఎస్ అఖిల్ భారతీయ ప్రచార్ ప్రముఖ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ ఏడాది చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎజెండాను ఈ కీలక సమావేశాల్లో నిర్ణయిస్తామని చెప్పారు. గత ఏడాది ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశం హర్యానాలోని సమాల్కాలో మార్చి 12,13.14 తేదీల్లో జరిగింది.
నాగపూర్‌లో మార్చిలో జరిగే వార్షిక సమావేశాల్లో సామాజిక సామరస్యం, జనాభా నియంత్రణ మార్గాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని సంఘ్ వర్గాలు తెలిపాయి. దేశంలోని బెంగాల్, అసోం, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా అసమతౌల్యత ఆందోళన కలిగిస్తోందని, దీనికి కారణాలు, పరిణామాలపై చర్చ జరుగుతుందని వివరించాయి.