Share News

RSS on Bangla Attacks: బంగ్లాలో హిందువులపై దాడులు... ఆర్ఎస్ఎస్ సీరియస్

ABN , Publish Date - Nov 30 , 2024 | 09:11 PM

స్వీయ రక్షణకోసం ప్రజాస్వామ్యబద్ధంగా హిందువులు గళం వినిపిస్తుంటే, ఆ స్వరాన్ని అణిచివేసేందుకు బంగ్లా ప్రభుత్వం చట్టవ్యతిరేక మార్గాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తోందని హోసబలే ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకుంటోందని అన్నారు.

RSS on Bangla Attacks: బంగ్లాలో హిందువులపై దాడులు... ఆర్ఎస్ఎస్ సీరియస్

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై కొనసాగుతున్న దాడులు, హత్యలు, దహనకాండలు, లూటీలపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం విఫలమైందని తప్పుపట్టింది. హిందువులు, మైనారిటీలపై ఇస్లామిక్ అతివాదులు జరుగుతున్న దాడులను కట్టిడి చేయాలని, ఇందుకోసం అంతర్జాతీయ సమాజ మద్దతును కూడగట్టాలని భారత ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలె కోరారు.

Attack on Bangladesh Hindus: బంగ్లాదేశ్ హిందువులపై దాడులు.. కోల్‌కతా ఆసుపత్రి సంచలన నిర్ణయం


హిందూ సాధువు, ఇస్కాన్‌కు చెందిన నేత చిన్మయ్ కృష్ణదాస్‌‌ను నవంబర్ 27న బంగ్లాలో అరెస్టు చేయడం, ఆయనను తక్షణం అరెస్టు చేయాలని హిందువులు నిరసనలు తెలవడం, ఈ క్రమంలో హిందువులకు-ఇస్కాన్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ప్రార్థనల అనంతరం వందలాది వంది మూడు దేవాలయాలపై దాడులకు దిగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కృష్ణదాస్‌ అరెస్టు అన్యాయమని, తక్షణం ఆయనను విడుదల చేయాలని బంగ్లా ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్‌ డిమాండ్ చేసింది.


కాగా, స్వీయ రక్షణకోసం ప్రజాస్వామ్యబద్ధంగా హిందువులు గళం వినిపిస్తుంటే, ఆ స్వరాన్ని అణిచివేసేందుకు బంగ్లా ప్రభుత్వం చట్టవ్యతిరేక మార్గాలను అనుసరిస్తున్నట్టు కనిపిస్తోందని హోసబలే ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఊరుకుంటోందని అన్నారు. ఇలాంటి క్లిష్ట తరుణంలో బాధిత హిందువులు, మైనారిటీలకు భారత్, అంతర్జాతీయ సమాజం సంఘీభావంగా నిలబడాలని కోరారు.


ఇవి కూడా చదవండి

Arvind Kejriwal: కేజ్రీవాల్‌పై ద్రావకం పోసేందుకు యువకుడి యత్నం

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా ఊటీకి ప్రత్యేక రైళ్లు

Suburban trains: ఇక.. సబర్బన్‌ రైళ్లకు ఏసీ బోగీలు

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 30 , 2024 | 09:15 PM