Share News

Viral Video: కిమ్ జోంగ్, సోరేస్‌తో డిన్నర్ గురించి జైశంకర్‌కు ప్రశ్న.. షాకింగ్ అన్సార్

ABN , Publish Date - Oct 06 , 2024 | 04:59 PM

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దౌత్యపరమైన సమాధానాల విషయంలో ఎంతో ఫేమస్ అని చెప్పవచ్చు. గతంలో కూడా ఆయన పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సమాధానాలు వైరల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పడు కూడా అచ్చం అలాగే జరిగింది. అదేంటో ఇక్కడ చుద్దాం రండి.

Viral Video: కిమ్ జోంగ్, సోరేస్‌తో డిన్నర్ గురించి జైశంకర్‌కు ప్రశ్న.. షాకింగ్ అన్సార్
s Jaishankar

భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar) తరచుగా పలు మార్లు ఇంటర్వ్యూలలో కీలక ప్రశ్నలకు తెలివైన సమాధానాలు చెప్పి ప్రసిద్ధి చెందారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే జరిగింది. శనివారం ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జైశంకర్‌ని ఓ ప్రశ్న అడిగారు. ఆ క్రమంలో మీకు డిన్నర్ చేసే అవకాశం వస్తే ఉత్తర కొరియా ప్రధాని కిమ్ జోంగ్ ఉన్ లేదా అమెరికన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్‌లలో ఎవరితో విందు చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. దీనిపై జైశంకర్ స్పందిస్తూ ఇప్పుడు నవరాత్రులని, తాను ఉపవాస దీక్షలు చేస్తున్నానని వెల్లడించారు.


ప్రశంసలు

విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానానికి అక్కడ ఉన్న ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. విదేశాంగ మంత్రి సమాధానానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన ఇచ్చిన సమాధానానికి జనం పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్ద విమర్శకుడని, అదే సమయంలో భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో జార్జ్ సోరోస్ జోక్యం చేసుకున్నారని బీజేపీ చాలాసార్లు గతంలో ఆరోపించింది.


ఎలాంటి చర్చలు ఉండవు

అంతేకాదు SCO సదస్సు సందర్భంగా పాకిస్తాన్‌తో చర్చలు జరపబోమని విదేశాంగ మంత్రి శనివారం మరోసారి స్పష్టం చేశారు. రాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల మంత్రి మాట్లాడుతూ, పాకిస్తాన్ పర్యటన బహుపాక్షిక కార్యక్రమంలో భాగమని అన్నారు. భారత్-పాకిస్తాన్ సంబంధాలపై చర్చించేందుకు తాను అక్కడికి వెళ్లడం లేదన్నారు. తాను SCOలో మంచి సభ్యునిగా ఉండేందుకు మాత్రమే అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు.


9 ఏళ్ల తర్వాత విదేశాంగ మంత్రి

విదేశాంగ మంత్రిగా ఎస్. జైశంకర్ తొలిసారి పాకిస్తాన్‌లో పర్యటించనున్నారు. జైశంకర్ గత ఆరేళ్లుగా ఏళ్లుగా మోదీ ప్రభుత్వంలో నిరంతరం విదేశాంగ మంత్రిగా కొనసాగుతున్నారు. ఉగ్రవాదంపై పొరుగుదేశంతో చర్చలు ఆగిపోయిన 9 ఏళ్లకు విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు చివరిసారిగా ఈ శుత్రదేశంలో పర్యటించారు.


ఇవి కూడా చదవండి:

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Business News and Latest Telugu News

Updated Date - Oct 06 , 2024 | 05:01 PM