Sam Pitroda Comments: బీజేపీ ఆరోపణలు.. స్పందించిన ఖర్గే
ABN , Publish Date - Apr 24 , 2024 | 04:02 PM
కాంగ్రెస్ పార్టీ నేత శామ్ పిట్రోడా వంశపారంపర్య పన్ను వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. బుధవారం కేరళలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తొసిపుచ్చారు. బీజేపీ వాళ్లు ఆరోపిస్తున్నట్లు ఆ ఉద్దేశ్యం తమకు లేదన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీ నేత శామ్ పిట్రోడా వంశపారంపర్య పన్ను వ్యాఖ్యల నేపథ్యంలో ఆ పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఆ క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. బుధవారం కేరళలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తొసిపుచ్చారు. బీజేపీ వాళ్లు ఆరోపిస్తున్నట్లు ఆ ఉద్దేశ్యం తమకు లేదన్నారు.
Mallikarjun Kharge: 1962 యుద్ధంలో ఇందిరాగాంధీ నగలు విరాళమిచ్చారు.. మోదీ 'మంగళసూత్ర' వ్యాఖ్యలపై ఖర్గే
అయినా శామ్ పిట్రోడా ఆలోచనను తమపై ఎందుకు రద్దుతున్నారంటూ బీజేపీ నేతలను ఖర్గే ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇదంతా ఎన్నికల్లో విజయం సాధించడం కోసం బీజేపీ చేస్తున్న కుయుక్తులని ఆయన అభివర్ణించారు. ఇక కాంగ్రెస్ పార్టీలో మరో సీనియర్ నేత జై రాం రమేష్ సైతం స్పందించారు. పిట్రోడా వ్యాఖ్యలతో పార్టీకి సంబంధమే లేదన్నారు.
ఇక శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతుంది. దేశాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని ఆరోపించింది. అలాగే ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తమదైనశైలిలో విరుచుకుపడ్డుతున్నారు. ఏప్రిల్ 26వ తేదీన లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగనుంది. అలాంటి వేళ.. పిట్రోడా వ్యాఖ్యలను ప్రత్యర్థి పార్టీ బీజేపీ ఆయుధంగా మలుచుకుంది.
Lok Sabha elections: ఎల్లుండే రెండో దశ పోలింగ్
ఇక రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన శామ్ పిట్రోడా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో వంశపారంపర్య పన్ను అమలవుతుందన్నారు. అదే తరహా పన్ను భారత్‌లో తీసుకు రావాలన్నారు. అంటే.. అమెరికాలో ఓ వ్యక్తి 100 మిలియన్ డాలర్ల సంపద కలిగి ఉన్నాడు. అతడు మరణిస్తే.. అతడి ఆస్తిలో 45 శాతం అతడి వంశాంకురానికి చెందుతుంది.
PM Modi: ‘బతికుండగానే కాదు.. చనిపోయిన తర్వాత దోచుకుంటుంది’
అంటే అతడి పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తుంది. మిగిలిన 55 శాతం ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే శామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఎన్నికల వేళ.. ప్రత్యర్థి పార్టీలకు అంది వచ్చిన అవకాశంగా మారింది. అంతే రెండో దశ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఆ వ్యాఖ్యలు ప్రచారంగా మారాయి. మరోవైపు శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అంతగా అంటిముట్టనట్లుగా వ్యహరిస్తుంది.
Read National News and Telugu News