Sanjauli Mosque row: అక్రమ ప్రార్థనా మందిరంపై పెల్లుబికిన నిరసనలు.. పోలీసులు లాఠీచార్జి
ABN , Publish Date - Sep 11 , 2024 | 02:49 PM
సంజౌలి ప్రాంతంలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించేందుకు పలు హిందూ సంస్థలు ధల్లి ఏరియాలో సమావేశం కావడం, ఇందుకు ప్రతిగా ధల్లి టన్నెల్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రికత్త నెలకొంది.
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) రాజధాని సిమ్లా (Shimla) బుధవారంనాడు నిరసనలతో అట్టుడికింది. నిషేధాజ్ఞలను సైతం లెక్కచేయకుండా నిరసనకారులు బారికేడ్లను దాటుకుంటూ దూసుకురావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసు లాఠీజార్జి జరిపారు. సంజౌలి ప్రాంతంలో అక్రమ మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించేందుకు పలు హిందూ సంస్థలు ధల్లి ఏరియాలో సమావేశం కావడం, ఇందుకు ప్రతిగా ధల్లి టన్నెల్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ఉద్రికత్త నెలకొంది.
కాగా, నిరసనకారులు పోలీసు బారికేడ్లను దాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి జరిపారు. వాటర్ కెనాన్లతో ముందుకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ప్రదర్శకులు అక్రమ కట్టడాన్ని కూల్చేయాలంటూ నినాదాలు చేశారు. అనధికార మసీదు నిర్మాణంపై అధికారులకు తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. అది ప్రార్థనా మందిరమా కాదా అనేది ప్రశ్న కాదని, కట్టడం చట్టబద్ధతనే తాను ప్రశ్నిస్తున్నామని చెప్పారు.
ఐదంతస్తుల అక్రమ మసీదు
ఈ వివాద 2010 నాటిది. తొలుత దుకాణం ఉన్న చోట నిర్మాణం ప్రారంభమైంది. పలు నోటీసులు ఇచ్చినప్పటికీ మసీదును 6750 చదరపుటడుగులు విస్తరించారు. ఇది హిమాచల్ ప్రభుత్వానికి చెందిన భూమిగా చెబుతుండగా, మసీదు ఇమామ్ మాత్రం ఇది 1947 క్రితం నాటిదని, వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తి అని చెబుతున్నారు.
45 సార్లు విచారణలు
అక్రమ మసీదు నిర్మాణంపై సెప్టెంబర్ 7న మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో విచారణ జరిగింది. 2010 నుంచి 45 సార్లు ఇదే అంశంపై విచారణ జరిగినా తుది నిర్ణయానికి రాలేకపోయారు. ఈ వ్యవధిలో మసీదు నిర్మాణం రెండు అంతస్తుల నుంచి ఐదు అంతస్తులకు పెరిగింది. ఆ ఏరియాలో ముస్లిం జనాభా వేగంగా పెరగడాన్ని కూడా స్థానికులు గుర్తించారు. మసీదును ఆ వర్గం వారు విస్తరిస్తూ భూ దురాక్రమణలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Read More Nationa News and Latest Telugu News
Amit Shah: రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా ట్వీట్..