Supreme court: మహువా మెయిత్రా పిటిషన్‌పై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీం నోటీసు
ABN , Publish Date - Jan 03 , 2024 | 04:12 PM
తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రాపై లోక్‌సభ బహిష్కరణ వేటు పడిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌పై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీంకోర్టు బుధవారంనాడు నోటీసులు పంపింది. ముూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ నేత మహువ మొయిత్రా (Mahua Moitra)పై లోక్‌సభ బహిష్కరణ వేటు పడిన వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆమె వేసిన పిటిషన్‌పై లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు నోటీసులు పంపింది. రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇదే సమయంలో, లోక్‌సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మెయిత్రాకు కోర్టు అనుమతి నిరాకరించింది.
వ్యాపారవేత్త దర్శన్ హీరానందానికి తన పార్లమెంటరీ లాగిన్ వివారాలను షేర్ చేశారనే కారణంగా మహువ మొయిత్రాను లోక్‌సభ నుంచి గత నెలలో బహిష్కరించారు. లాగిన్ వివరాలు షేర్ చేసిన విషయాన్ని మొయిత్రా అంగీకరిస్తూనే తాను ఇందువల్ల ఎలాంటి లబ్ధి పొందలేదని వివరణ ఇచ్చారు. తనను బహిష్కరించే అధికారం ఎథిక్స్ కమిటీకి లేదన్నారు. హీరానందానిని, తన మాజీ పార్టనర్ అనంత్ దేహాద్రయిని కానీ క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు తనను ప్యానెల్ అనుమతించలేదని చెప్పారు. ఈ క్రమంలో పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా మహువా మొయిత్రా కోల్పోయారు. దీనిపై కూడా మెయిత్రా ఘాటుగా స్పందించారు. తన వయస్సు 49 ఏళ్లేనని, మరో 30 ఏళ్లు పార్లమెంటు లోపల, బయట కూడా పోరాడతానని అన్నారు.