Supreme Court: 15 నెలల తర్వాత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్
ABN , Publish Date - Aug 05 , 2024 | 02:04 PM
ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి 10 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు ఉందని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదీ కూడా చట్టబద్ద అధికారంగానే ఉందని.. అంతే కానీ ఇది కార్యనిర్వాహక అధికారం మాత్రం కాదని పేర్కొంది.
న్యూఢిల్లీ, ఆగస్ట్ 05: ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ)కి 10 మంది సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కు ఉందని కేజ్రీవాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదీ కూడా చట్టబద్ద అధికారంగానే ఉందని పేర్కొంది.
Also Read: TMC: పార్టీలో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టిన సీఎం మమత
ఈ విషయం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ నిబంధనల్లోనే ఉందని తెలిపింది. ఇక ఎంసీడీలో సభ్యుల నామినేషన్ వ్యవహారంలో ఎల్జీకి స్థానిక ప్రభుత్వ సలహాలు అవసరం లేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జెపి పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఆ క్రమంలో కేజ్రీవాల్ ప్రభుత్వం గతంలో వేసిన పిల్‌ను కొట్టివేసింది.
Also Read: Article 370: అయిదో వార్షికోత్సవం.. బీజేపీ ర్యాలీ.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత
2022 ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ గెలుపు..
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) పరిధిలో మొత్తం 250 డివిజనులున్నాయి. అయితే 2022లో ఎంసీడీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 134 డివిజనుల్లో విజయం సాధించింది. అంటే సగానికిపైగా స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోకి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలు వెళ్లాయి. దాంతో 15 ఏళ్లుగా ఎంసీడీలో అధికారాన్ని చెలాయిస్తున్న బీజేపీకి చరమగీతం పాడినట్లు అయింది. ఇక ఈ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 9 స్థానాలు గెలుచుకున్నాయి.
Also Read: Ministry of External Affairs: బంగ్లాదేశ్‌లోని భారతీయులకు కీలక సూచన
10 మందిని నామినేట్ చేసిన ఎల్జీ...
ఇక అదే సమయంలో ఎంసీడీకి 10 మంది సభ్యులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేశారు. ఈ వ్యవహారం కేజ్రీవాల్ ప్రభుత్వానికి అంతగా రుచించ లేదు. దాంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు 10 మంది సభ్యులు నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేదంటూ సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ ప్రభుత్వం పిల్ వేసింది. దాదాపు 15 నెలల అనంతరం కేజ్రీవాల్ వేసిన పిల్‌ను ఆగస్ట్ 05వ తేదీన సుప్రీంకోర్టు పరిశీలించి పైవిధంగా తన తీర్పును వెల్లడించింది.
Also Read: Gold Rates Today: శ్రావణమాసం వచ్చేసింది.. ఇక బంగారానికి ఫుల్ డిమాండ్
ఢిల్లీ మద్యం పాలసీపై సీీబీఐకు సిఫార్స్ చేసిన ఎల్జీ..
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సెనాకు కేజ్రీవాల్ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఇటీవల ఢిల్లీలో కురిసిన భారీ వర్షాల కురిశాయి. ఈ కారణంగా ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ బేసిమెంట్‌లో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మరణించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఎల్జీ విమర్శలు సైతం చేసిన విషయం విధితమే.
అలాగే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో చాలా మంది అరెస్ట్ కావడం.. దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నేతలు సైతం తీహాడ్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ ప్రభుత్వం రూపొందించిన ఈ మద్యం పాలసీపై తొలుత ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు పాలసీపై దర్యాప్తు చేయించాలని సీబీఐకి ఈ ఢిల్లీ ఎల్జీ వి కె సక్సెనా సిఫార్స్ చేసిన విషయం విధితమే.
Also Read: Wayanad Landslides: నాలుగు మృతదేహాలే దొరికాయంటూ మన్సూర్ ఆవేదన
Read More National News and Latest Telugu News