Share News

Shabarimala Yatra: పంపాలో మహిళలకు ప్రత్యేక వసతి

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:08 AM

శబరిమల యాత్రకు వెళ్లే మహిళల చిరకాల డిమాండ్‌ నెరవేరింది. కేరళ సర్కారు మహిళల కోసం పంపా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది.

Shabarimala Yatra: పంపాలో మహిళలకు ప్రత్యేక వసతి

శబరిమల, డిసెంబరు 9: శబరిమల యాత్రకు వెళ్లే మహిళల చిరకాల డిమాండ్‌ నెరవేరింది. కేరళ సర్కారు మహిళల కోసం పంపా బేస్‌లో ప్రత్యేక వసతి సదుపాయాన్ని కల్పించింది. ట్రావెన్‌కోర్‌ దేవొస్వం బోర్డు(టీడీబీ) అధ్యక్షుడు పీఎస్‌ ప్రసాద్‌ సోమవారం ఈ వసతి గృహాన్ని ప్రారంభించారు. ఇందులో ఏకకాలంలో 50 మంది మహిళలు విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుందని, అయ్యప్ప దీక్షాధారులతోపాటు వచ్చే మహిళలు తమవారు తిరిగి వచ్చేవరకు పంపా బేస్‌, హిల్‌టాప్‌ వద్ద వాహనాల్లోనే ఎదురుచూసేవారు. ఇలాంటి వారికి ఈ వసతిగృహం ఉపయోగపడుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Dec 10 , 2024 | 03:08 AM