Share News

Baramati: పెద్దనాన్న వర్సెస్ అబ్బాయి

ABN , Publish Date - Oct 24 , 2024 | 09:11 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఈ నేపథ్యంలో బారమతి అసెంబ్లీ అభ్యర్థిగా యోగేంద్ర పవార్ పేరును ఎన్సీపీ (శరద్ పవార్) గురువారం ప్రకటించింది. ఇప్పటికే ఇదే స్థానం నుంచి ఎన్సీపీ (అజిత్ పవార్) అభ్యర్థిగా అజిత్ పవార్ బరిలో దిగారు. అదీకాక అజిత్ పవార్ తమ్ముడి కుమారుడే ఈ యోగేంద్ర పవార్.

Baramati: పెద్దనాన్న వర్సెస్ అబ్బాయి

ముంబయి, అక్టోబర్ 24: బారమతి రాజకీయం అంతా పవార్ కుటుంబాల మధ్య సాగుతుంది. బారమతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థిగా యోగేంద్ర పవార్‌ పేరు గురువారం ఆ పార్టీ నాయకత్వం ముంబయిలో ప్రకటించింది. ఈ యోగేంద్ర పవార్ ఎవరో కాదు. ఎన్సీపీ చీలిక వర్గం అధినేత అజిత్ పవార్‌కు స్వయంగా చిన్న సోదరుడు శ్రీనివాస్ కుమారుడే కావడం గమనార్హం. దీంతో మరోసారి అజిత్ పవార్, శరద్ పవార్ వర్గాల మధ్య రసవత్తర పోరు సాగనుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ శరద్ పవార్ అభ్యర్థిగా బరిలో దిగిన సుప్రీయా సులే ప్రచారంలో యోగేంద్ర పవార్ అన్ని తానై వ్యవహరించిన సంగతి తెలిసిందే.

Also Read: Mumbai: ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడిన ‘ఆస్కార్’


యూఎస్‌లోని బోస్టన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో పట్టా అందుకున్నాడీ యోగేంద్ర పవార్. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చి.. శరద్ పవార్ నీడలో రాజకీయం నేర్చుకున్నాడు. ఇక గత సెప్టెంబర్‌లో బారమతిలో చేపట్టిన స్వాభిమాన్ యాత్రలో అతడు క్రియాశీలకంగా వ్యవహరించాడు.

Also Read:TamilNadu: రోడ్డుపైకి భారీగా చేరిన నురగ.. ఎందుకంటే..


అలాగే శరద్ పవార్ స్థాపించిన విద్యా ప్రతిష్టాన్‌ సంస్థకు కోశాధికారిగా కూడా యోగేంద్ర వ్యవహరిస్తున్నారు. యోగేంద్ర పవార్ తండ్రి శ్రీనివాస్‌ సైతం శరద్ పవార్‌ను వీడి మహాయుతి ప్రభుత్వంలో చేతులు కలిపిన అజిత్ పవార్‌‌పై గతంలో తీవ్ర విమర్శులు గుప్పించిన సంగతి తెలిసిందే.

Also Read: TS Politics: గాదరి కిషోర్‌పై మందుల సామేల్ విసుర్లు


అయితే తాను రాష్ట్ర అసెంబ్లీకి వెళ్లాలి లేదనేది బారమతి ప్రజలతోపాటు శరద్ పవార్ నిర్ణయిస్తారని గతంలో యోగేంద్ర చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. యోగేంద్ర పవార్‌తోపాటు పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ఎన్సీపీ (శరద్ పవార్) గురువారం ప్రకటించింది.

Also Read: Ram Mohan Naidu: ఇది చారిత్రాత్మకమైన రోజు


ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారమతి నుంచి ఎన్సీపీ శరద్ పవార్ అభ్యర్థిగా సుప్రీయా సులే బరిలో దిగారు. అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ అభ్యర్థిగా సునేత్రి పవార్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో సుప్రీయా సులే లక్షన్నర మెజార్టీతో గెలుపొందారు. ఆమె గెలుపులో యోగేంద్ర పవార్ క్రియాశీలకంగా వ్యవహరించారని ఓ చర్చ సైతం శరద్ పవార్ వర్గంలో నడుస్తుంది.


మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 20వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిదనేది తెలియాలంటే నవంబర్ 23 వరకు ఆగాల్సిందే. ఇంకోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలు 85 సీట్ల చొప్పున పంచుకున్నాయి. అంటే 255 సీట్లలో ఈ మూడు పార్టీలు అభ్యర్థలను బరిలో నిలుపుతాయి. మిగిలిన 33 సీట్లలో తమకు అండగా నిలబడిన చిన్న పార్టీలకు చెందిన అభ్యర్థులకు కేటాయించనున్నారు.

For National news And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 09:14 PM