Madhya Pradesh: యూపీ బాటలో మధ్యప్రదేశ్.. ఇదీ విషయం
ABN , Publish Date - Jul 21 , 2024 | 11:03 AM
ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ పయనిస్తోంది. కన్వార్ యాత్ర జరిగే మార్గంలో ఆహార పదార్థాలు విక్రయించే యజమానులు విధిగా తమ పేర్లను బోర్డు మీద ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఉజ్జయిని మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. షాపు యజమానులు బోర్డు మీద విధిగా తమ పేరు, మొబైల్ నంబర్ ప్రదర్శించాలని స్పష్టం చేసింది.
ఉజ్జయిని: ఉత్తరప్రదేశ్ బాటలో మధ్యప్రదేశ్ పయనిస్తోంది. కన్వార్ యాత్ర జరిగే మార్గంలో ఆహార పదార్థాలు విక్రయించే యజమానులు విధిగా తమ పేర్లను బోర్డు మీద ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ స్పష్టం చేసింది. ఆ క్రమంలో ఉజ్జయిని మున్సిపల్ పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. షాపు యజమానులు బోర్డు మీద విధిగా తమ పేరు, మొబైల్ నంబర్ ప్రదర్శించాలని స్పష్టం చేసింది. లేదంటే భారీగా జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. ఫస్ట్ టైమ్ ఉల్లంఘిస్తే రూ.2 వేల ఫైన్ వేస్తామని వివరించింది. అదే తప్పు రెండోసారి చేస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది. వినియోగదారుల భద్రత, పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, ముస్లిం వ్యాపారులను వేధించడం తమ లక్ష్యం కాదని మేయర్ తేల్చి చెప్పారు.
మోసపోతే..?
బోర్డు మీద వ్యాపారస్తులు పేరు, మొబైల్ నంబర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఉజ్జయిని మున్సిపాలిటీ ఆమోదం తెలిపింది. వ్యాపారులు తమ బోర్డు మీద పేర్లు, మొబైల్ నంబర్లు రాసే ప్రక్రియ పూర్తి చేశామని, దానిని వారు అమలు చేయాల్సి ఉందని ఉజ్జయిని మేయర్ స్పష్టం చేశారు. ఒకవేళ వినియోగదారుడు షాపులో కొనుగోలు చేసిన వస్తువు మీద సంతృప్తిగా లేకుంటే.. లేదా మోసపోతే ఆ వ్యక్తి షాపు యజమాని డీటెల్స్ తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
కుంభమేళా
ఉజ్జయినిలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహకాళి ఆలయం ఉంది. ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. అమ్మవారిని దర్శించుకునేందుకు విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసం తొలి సోమవారం నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉజ్జయినిలో ప్రతి 12 ఏళ్లకోసారి కుంభమేళాను ఘనంగా నిర్వహిస్తారు. 2028లో కుంభామేళా జరగనుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వస్థలం ఉజ్జయిని అనే సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telugu News and National News