Share News

Karnataka: నిద్ర రాకపోతే పెగ్ వేసుకోండి.. మహిళా మంత్రికి సూచించిన బీజేపీ నేత

ABN , Publish Date - Apr 15 , 2024 | 01:27 PM

"రాత్రి పూట మంచిగా నిద్ర పట్టాలంటే ఓ పెగ్ వేసుకోండి".. ఇవి స్వయంగా ఓ మహిళా నేత.. మహిళా మంత్రికి ఇచ్చిన సలహా. ఆమె వ్యాఖ్యలు కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కర్ణాటకలోని(Karnataka) బెలగావిలో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాటిల్ పాల్గొన్నారు.

Karnataka: నిద్ర రాకపోతే పెగ్ వేసుకోండి.. మహిళా మంత్రికి సూచించిన బీజేపీ నేత

బెంగళూరు: "రాత్రి పూట మంచిగా నిద్ర పట్టాలంటే ఓ పెగ్ వేసుకోండి".. ఇవి స్వయంగా ఓ నేత.. మహిళా మంత్రికి ఇచ్చిన సలహా. ఆయన వ్యాఖ్యలు కాస్తా నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కర్ణాటకలోని(Karnataka) బెలగావిలో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ పాల్గొన్నారు. బెలగావి లోక్‌సభ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ పోటీ చేస్తున్నారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బెలగావిలో బీజేపీకి పెరుగుతున్న మహిళల మద్దతు చూస్తుంటే హెబ్బాల్కర్‌కి నిద్ర పట్టడం లేదు. అక్కడ రమేష్ జార్కిహోళి ప్రచారం చేయడం కూడా ఆమెకు కష్టమే. రాత్రి మంచిగా నిద్రపట్టాలంటే ఆమెకు నిద్రమాత్ర లేదా పెగ్ పడాలి” అని పాటిల్ వ్యాఖ్యానించారు.


రమేశ్‌ జార్కిహోళి ప్రచారం చేస్తుండటం కూడా ఆమెకు ఇబ్బందికరమేనన్నారు. రాత్రి నిద్ర పట్టాలంటే ఆమె స్లీపింగ్‌ పిల్‌ కానీ, ఎక్స్‌ట్రా పెగ్‌ కానీ వేసుకోవాలని సూచించడంపై లక్ష్మి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.

Amarnath Yatra 2024: అమర్‌నాథ్ యాత్రికులకు అలర్ట్.. అడ్వాన్స్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.


బీజేపీ రహస్య ఎజెండా ఇదేనని ఆరోపించారు. జై శ్రీరామ్‌, భేటీ బచావో, భేటీ పడావో అని జపిస్తే చేయడంతో సరిపోదని, మహిళలను గౌరవించాలని అన్నారు. ఇది మన హిందూ సంస్కృతి. సంజయ్ పాటిల్ వ్యాఖ్యలు తనకే కాదు దేశంలోని మహిళలందరికీ అగౌరవమని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 01:46 PM