Share News

Anuradha Paudwal: బాలీవుడ్ గాయని అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరిక

ABN , Publish Date - Mar 16 , 2024 | 02:59 PM

బాలీవుడ్ ప్రముఖ గాయని అనూరాధా పౌడ్వాల్ భారతీయ జనతా పార్టీలో చేరారు. శనివారంనాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. సనాతన ధర్మానికి కట్టుబడిన బీజేపీలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పౌడ్వాల్ అన్నారు.

Anuradha Paudwal: బాలీవుడ్ గాయని అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరిక

న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ గాయని అనూరాధా పౌడ్వాల్ (Anuradha Paudwal) భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. శనివారంనాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పార్టీ సభ్యత్వాన్ని అందుకున్నారు. సనాతన ధర్మానికి కట్టుబడిన బీజేపీలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పౌడ్వాల్ అన్నారు.


అనూరాధా పౌడ్వాల్ వివిధ భాషల్లో వందలాది పాటలు, భజనలు పాడారు. కర్ణాటకలోని క్వారాల్‌లో జన్మించిన ఆమె 19వ ఏటనే 'అభిమాన్' చిత్రంలో 'ఓకాంరం బిందు సంయుక్తం' అనే పాటతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎస్డీ బర్మన్ ఈ పాటను కంపోజ్ చేశారు. 1983లో 'హీరో' చిత్రంలో ఆమె పాడిన 'తూ మేరా హీరో హై' పాట సూపర్‌హిట్ అయింది. ఆ తర్వాత నాలుగుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. 1990 దశకంలో ఆమె కెరీర్ టాప్ గేర్‌లో నడిచింది. 'ఆషికీ', 'సడక్', 'దిల్ హై కి మాన్తా నహీ' సౌండ్ ట్రాక్స్‌ సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. 2000 తర్వాత ఎక్కువగా భక్తిగీతాలపై ఆమె దృష్టి సారించారు. 2016లో సూర్యోదయ ఫౌండేషన్‌ను స్థాపించి పేదలకు హెల్త్‌కేర్‌ సేవలు అందించారు. 2011లో మదర్ థెరెసా అవార్డును అందుకున్నారు. 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

Updated Date - Mar 16 , 2024 | 02:59 PM