Share News

Tejaswi Yadav: సోఫాలు, ఎసీలు, పరుపులు ఎత్తుకెళ్లారు.. తేజస్విపై బీజేపీ సంచలన ఆరోపణ

ABN , Publish Date - Oct 07 , 2024 | 07:17 PM

బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ పై భారతీయ జనతా పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక నివాసాన్ని తేజస్వి ఖాళీ చేసే సమయంలో అనేక వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది.

Tejaswi Yadav: సోఫాలు, ఎసీలు, పరుపులు ఎత్తుకెళ్లారు.. తేజస్విపై బీజేపీ సంచలన ఆరోపణ

పాట్నా: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ (Tejaswi Yadav)పై భారతీయ జనతా పార్టీ (BJP) సంచలన ఆరోపణలు చేసింది. అధికారిక నివాసాన్ని తేజస్వి ఖాళీ చేసే సమయంలో అనేక వస్తువులను ఎత్తుకెళ్లారని ఆరోపించింది. ఎసీలు, సోఫోలు, పరువులు, వాటర్ ట్యాప్‌లు వంటివి మాయమైనట్టు బీహార్ బీజేపీ మీడియా ఇన్‌చార్జి డేనిష్ ఇక్బాల్ ఆరోపించారు.


తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాట్నాలోని 5 దేశ్‌రతన్ రోడ్డులోని బంగ్లా ఆయనకు కేటాయించారు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో తేజస్వి పదవి కోల్పోయారు. ఉప ముఖ్యమంత్రి పదవిని సామ్రాట్ చౌదరికి నితీష్ కుమార్ కేటాయించారు. తేజస్వికి గతంలో కేటాయించిన బంగ్లాను తాజాగా సమ్రాట్ చౌదరికి నితీష్ సర్కార్ కేటాయించడంతో తేజస్వి గత ఆదివారంనాడు బంగ్లా ఖాళీ చేశారు. విజయదశమి రోజున సమ్రాట్ చౌదరి ఆ భవంతిలోకి చేరనున్నాను. ఈ నేపథ్యంలో బీజేపీ తాజా ఆరోపణలు చేసింది.

PM Modi: మాజీ సీఎంకు ఫోన్ చేసిన మోదీ


''సమ్రాట్ చౌదరికి తేజస్వి ఉండే భవనాన్ని ప్రభుత్వం కేటాయించింది. నవరాత్రికి చౌదరి ఆ బంగ్లాలోకి వెళ్తున్నారు. తీరా చూస్తే ఆ బంగ్లాలోని వాష్ బేసిన్లు, వాటర్ ట్యాప్‌లు, సామగ్రి కనిపించకుండా పోయాయి. హైడ్రాలిక్ బెడ్‌ను తీసుకుపోయారు. బ్యాడ్మింటన్ కోర్టు మ్యాట్ కూడా లేదు. జిమ్ ఖాళీగా ఉంది. ఎక్సర్‌సైజ్ మిషన్ లేదు. ఫౌండేషన్స్ లైట్లు కూడా ఎత్తుకెళ్లారు'' అని డేనిష్ ఇక్బాల్ తెలిపారు. దీనిపై సమ్రాచ్ చౌదరి పెర్సనల్ సెక్రటరీ శత్రుఘ్న ప్రసాద్ మాట్లాడుతూ, సుశీల్ మోదీ బంగ్లాను అప్పట్లో ఖాళీ చేసినప్పుడు రెడు హైడ్రాలిక్ బెడ్స్, సోఫా సెట్లు ఉండేవని, అవన్నీ కనిపించకుండా పోయాయని చెప్పారు. 20 స్ప్లిట్ ఏసీలు మాయమయ్యాయని, ఆపరేటింగ్ రూమ్‌లో కంప్యూటర్ చైర్ లేదని, వంటగదిలో ఫ్రిడ్జి కానీ, ఆర్ఓ కానీ లేవని తెలిపారు. గోడలుకున్న లైట్లు కూడా ఊడబెరికి తీసుకువెళ్లారని ఆరోపించారు.


ఆర్జేడీ కౌంటర్

కాగా, తేజస్వి ఖాళీ చేసిన బంగ్లాలో పలు వస్తువులు కనిపంచడం లేదంటూ బీజేపీ చేసిన ఆరోపణలను ఆర్జేడీ కొట్టివేసింది. మాయమైన వాటి జాబితాను భవన్ నిర్మాణ్ విభాగ్ విడుదల చేయాలని ఆర్జేడీ జాతీయ ప్రతినిధి శక్తి యాదవ్ డిమాండ్ చేశారు. అలా చేయలేని పక్షంలో తమకు క్షమాపణ చెప్పాలన్నారు. తమ వద్ద కూడా సాక్షాలు ఉన్నాయని, మీడియాతో సహా పలువురు వ్యక్తుల సమక్షంలో తాము కూడా వీడియో తీసామని తెలిపింది.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి...

Amith Shah: ముగిసిన భేటీ.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 07 , 2024 | 07:17 PM