Sonia Gandhi: సోనియాగాంధీ-జార్జి సోరోస్ సంబంధాలపై బీజేపీ సంచలన ఆరోపణ
ABN , Publish Date - Dec 08 , 2024 | 08:45 PM
అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను జార్జి సోరోస్ నుంచి నిధులు పొందే ఓసీసీఆర్‌పీ సంస్థ లైవ్ టెలికాస్ట్ చేసిందని, దీనిని బట్టే జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన సంబంధం అర్ధమవుతుందని బీజేపీ ఆరోపించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi)పై బీజేపీ (BJP) సంచలన ఆరోపణలు చేసింది. అమెరికాకు చెందిన జార్జ్ సోరోస్ పౌండేషన్ (George Soros Foundation) నుంచి ఆర్థిక సాయం పొందే ఎఫ్‌డీఎల్-ఏపీ (FDL-AP) ఫౌండేషన్‌తో సోనియాగాంధీకి సంబంధాలున్నాయని ఆరోపించింది. జమ్మూకశ్మీర్‌ను స్వతంత్ర దేశం చేయాలనే భావజాలంతో ఎఫ్‌డీఎల్-ఏపీ పౌండేషన్ పనిచేస్తోందని సామాజిక మాధ్యమంలో 'ఎక్స్'లో బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. దీనిని బట్టి భారతదేశ అంతర్గత వ్యవహారాలు, రాజకీయ సంబంధాలపై విదేశీ సంస్థల ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొంది.
Iltija Mufti: హిందుత్వ ఒక వ్యాధి.. ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు
''సోనియాగాంధీ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్ జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేసింది. భారతదేశ సంస్థలపై విదేశీ నిధుల ప్రభావాన్ని ఇలాంటి అంశాలు అద్దంపడతాయి. రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'లో ఆయనతో కలిసి సోరోస్-ఫండెడ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు సలీల్ షెట్టి పాల్గొన్నారు'' అని బీజేపీ తెలిపింది.
అదానీపై రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను జార్జి సోరోస్ నుంచి నిధులు పొందే ఆర్గనైజ్డ్ క్రైమ్అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పీ) సంస్థ లైవ్ టెలికాస్ట్ చేసిందని, దీనిని బట్టే జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన సంబంధం, భారత ఆర్థిక వ్యవస్థను పట్టాలు తప్పించే ప్రమాదకరమైన యోచన అర్ధమవుతుందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం జార్జ్ సోరోస్ తమ పాతమిత్రుడని బహిరంగంగానే ఒప్పుకున్నారని గుర్తు చేసింది.
ఇవి కూడా చదవండి..
Viral News: పుష్ప సినిమా స్టైల్లో బంగాళాదుంపల స్మగ్లింగ్.. అడ్డుకున్న పోలీసులు
Viral: కదులుతున్న కారు టాపుపై కూర్చుని పోలిసు అధికారి కుమారుడి పోజులు!
Read More National News and Latest Telugu News