Sita Soren: కల్పనా సోరెన్‌కు పోటీగా తెరపైకి సీతా సోరెన్
ABN , Publish Date - Jan 31 , 2024 | 08:56 PM
మనీలాండరింగ్ కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను బుధవారంనాడు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్న క్రమంలో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే జరిగితే ప్రత్యామ్నాయంగా ఆయన భార్య కల్పనా సోరెన్ కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా కల్పనను సీఎం చేయడానికి తాము వ్యతిరేకం అంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ తెరపైకి వచ్చారు.
రాంచీ: మనీలాండరింగ్ కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren)ను బుధవారంనాడు ఎన్‌ఫోర్స్ డైరెక్టరేట్ (ED) విచారణ చేస్తున్న క్రమంలో ఆయనను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇదే జరిగితే ప్రత్యామ్నాయంగా ఆయన భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren)కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అనూహ్యంగా కల్పనను సీఎం చేయడానికి తాము వ్యతిరేకం అంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ (Sita Soren) తెరపైకి వచ్చారు. 14 ఏళ్లుగా సీతా సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
''జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా కల్పనా సోరెన్‌ను ఎన్నుకునే ఎలాంటి ప్రక్రియనైనా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. కల్పనా సోరెన్ కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. రాజకీయ అనుభవం అంతకంటే లేదు'' అని సీతా సోరెన్ ఒక ప్రముఖ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. ఆసక్తికరంగా 49 మంది సభ్యుల జేఎంఎం కూటమి ఎమ్మెల్యేలలో 35 మంది మంగళవారంనాడు జరిగిన అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. వీరంతా కల్పనా సోరెన్‌కు మద్దతిచ్చేందుకు సుముఖంగా ఉండగా, గైర్హాజరైన ఎమ్మెల్యేలు సీతా సోరెన్‌కు బాసటగా ఉన్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. దీంతో జార్ఖాండ్ రాజకీయాల్లో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.