Social Media Harassment: సోషల్ మీడియా వేధింపులపై రాష్ట్రాలు చర్యలు తీసుకోవచ్చు.. కేంద్రం క్లారిటీ..
ABN , Publish Date - Dec 11 , 2024 | 05:54 PM
సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడంతోపాటు ఇతరులను దూషించటం సహా సైబర్ నేరాలకు పాల్పడే వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇంకా ఏం చెప్పిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించే, అప్రతిష్ట పాలు చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం (Social Media Harassment) చేస్తూ ఇతరులను దూషించటం సహా సైబర్ నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కేంద్రం పార్లమెంట్‌లో (parliament) వెల్లడించింది. ఈ క్రమంలో భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం సెక్షన్ 78 ప్రకారం మహిళలను వేధించే వారిపై అప్రతిష్టపాలు చేసే వారిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. ఇలాంటి కేసుల విషయంలో సంబంధిత చట్టంలోని సెక్షన్ ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలకు ఉపక్రమించవచ్చు.
వ్యక్తిగత స్వేచ్ఛ కాపాడేందుకు
మహిళలు, పిల్లలపై సైబర్ నేరాలు అరికట్టేందుకు కేంద్ర హోంశాఖ కూడా ప్రస్తుతం సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ చిల్డ్రన్ పథకాన్ని అమలు చేస్తోంది. దీని ప్రకారం వ్యక్తుల డేటా, వ్యక్తిగత స్వేచ్ఛ, హక్కులను కాపాడేందుకు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్టివ్ 2023 కూడా అమలులో ఉంది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది.
మోసాలపై చర్యలు
అయితే గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ సెక్యూరిటీ, ఆన్‌లైన్ మోసాల వంటి కార్యకలాపాలు డిజిటల్ ఇండియాలో ప్రధాన అడ్డంకులుగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కొత్త ఐటీ రూల్స్‌ని ప్రవేశపెట్టింది. దీంతో సోషల్ మీడియా జవాబుదారీతనం ద్వారా డిజిటల్ ఇండియాలో సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్ ట్రోలింగ్, ఆన్‌లైన్ మోసాలపై చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టం ద్వారా సామాజిక, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను మరింత సురక్షితంగా వినియోగించుకోవచ్చు.
జవాబుదారీతనంగా
కొత్త ఐటి చట్టం ప్రకారం సోషల్ మీడియాలో ఏదైనా కేసు వెలుగులోకి వచ్చినప్పుడు, వినియోగదారుల అనుమతి లేకుండా ఏదైనా పోస్ట్ చేసినట్లయితే లేదా ప్రయత్నించినట్లయితే అది ఆయన ఇమేజ్‌కి హాని కలిగించేలా మారుతుంది. ఈ ఫిర్యాదును నేరుగా సంబంధిత ప్లాట్‌ఫారమ్‌కు పంపవచ్చు. ఆ క్రమంలో జవాబుదారీతనంగా సమస్య పరిష్కరిస్తారు. లేదంటే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఆయా సమస్యకు సంబంధించి సైబర్ నిపుణులకు ఫోన్ లేదా మెయిల్ చేయవచ్చు.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Read More Business News and Latest Telugu News