Share News

DRDO: విజయవంతంగా అగ్ని-4 క్షిపణి ప్రయోగం

ABN , Publish Date - Sep 07 , 2024 | 05:20 AM

రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రూపొందించిన అగ్ని-4 బాలిస్టిక్‌ క్షిపణిని శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్‌ క్షేత్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.

DRDO: విజయవంతంగా అగ్ని-4 క్షిపణి ప్రయోగం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 6: రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) రూపొందించిన అగ్ని-4 బాలిస్టిక్‌ క్షిపణిని శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్‌ క్షేత్రం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. న్యూక్లియర్‌ కమాండ్‌ అథారిటీ పరిధిలోని స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. 20 మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణి 4,000 కి.మీ.దూరంలోని లక్ష్యాన్ని చేధించగలుగుతుంది.


1,000 కిలోల మందుగుండు సామగ్రిని తీసుకెళ్తుంది. నేల మీద తిరగగలిగే లాంచర్‌ ద్వారా దీన్ని ప్రయోగించవచ్చు. 2012లో తొలిసారిగా అగ్ని-4ను ప్రయోగించినప్పుడు అది 20 నిమిషాల్లో 3,000 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. దాన్ని వృద్ధి చేసి ప్రస్తుతం ప్రయోగించారు. సాంకేతిక, నిర్వహణపర లక్ష్యాలను అందుకొందని అధికారులు తెలిపారు.

Updated Date - Sep 07 , 2024 | 05:20 AM