Share News

Sunita Kejriwal: కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండి... సీఎం భార్య వీడియో మెసేజ్

ABN , Publish Date - Mar 29 , 2024 | 02:29 PM

మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున 'కేజ్రీవాల్ కో ఆశీర్వాద్' ప్రచారానికి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ బుధవారంనాడు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.

Sunita Kejriwal: కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండి... సీఎం భార్య వీడియో మెసేజ్

న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ఈడీ (ED) కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తరఫున 'కేజ్రీవాల్ కో ఆశీర్వాద్' (Kejriwal Ko Aashirwad) ప్రచారానికి ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal) బుధవారంనాడు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన భర్తకు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. దేశంలోని అత్యంత అవినీతి, నియంతృత్వ శక్తులపై తన భర్త పోరాడుతున్నారని, ఆయనకు ఆశీస్సులు, ప్రార్థనల ద్వారా మద్దతివ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 1న అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉండగా, ఏప్రిల్ 1వ తేదీ వరకూ ఆ కస్టడీని కోర్టు గురువారంనాడు పొడిగించింది. నేపథ్యంలో తాజా వీడియోను సునీతా కేజ్రీవాల్ విడుదల చేశారు.


''కేజ్రీవాల్ కో ఆశీర్వాద్ డ్రైవ్‌ను ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ నెంబర్‌కు మీ ఆశీర్వాదాలు, ప్రార్ధనలు పంపించండి. కేజ్రీవాల్ గురువారంనాడు తన వాదనను కోర్టు ముందుంచారు. కోర్టులో ఆయన ఏదైతే చెప్పారో అది చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. దేశంలోని అత్యంత శక్తివంతమైన అవినీతి శక్తులను ఆయన సవాలు చేశారు. నేను మీకు వాట్సాప్ నెంబర్- 8297324624 ఇస్తున్నాను. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆయనను ఆశీర్వదించండి" అని ఆమె తన వీడియో సందేశంలో తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 29 , 2024 | 02:53 PM