Food Safety: ప్రసాదం నాణ్యతపై ‘పిల్’ను తిరస్కరించిన సుప్రీం
ABN , Publish Date - Nov 30 , 2024 | 05:48 AM
ఆలయాల్లో పంపిణీ చేసే ప్రసాదం, ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేలా నిబంధనలు రూపొందించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) శుక్రవారం సుప్రీంకోర్టు తిస్కరించింది.
న్యూఢిల్లీ, నవంబరు 29: ఆలయాల్లో పంపిణీ చేసే ప్రసాదం, ఆహార పదార్థాల నాణ్యతను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేలా నిబంధనలు రూపొందించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) శుక్రవారం సుప్రీంకోర్టు తిస్కరించింది. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సిన విధానపర నిర్ణయమని, తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇది ప్రచారం కోసం వేసిన వ్యాజ్యం కాదని తెలిపారు.
ప్రసాదం, ఆహారం తిని భక్తులు అస్వస్తతకు గురయిన సందర్భాలు ఉండడంతో దీన్ని దాఖలు చేసినట్టు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘అలాంటప్పుడు దీన్ని ఒక్క ప్రసాదానికే పరిమితం చేయడం ఎందుకు? రెస్టారెంట్లు, కిరాణా కొట్లను కూడా కలపండి. అక్కడ కూడా కల్తీ జరగవచ్చు’’ అని వ్యాఖ్యానించింది.