Share News

Kolkata Doctor Case: సుప్రీంలో ఆర్‌‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు చుక్కెదురు..

ABN , Publish Date - Sep 06 , 2024 | 01:03 PM

సందీప్ ఘోష్‌తో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు నిందితులను సీబీఐ విచారిస్తోంది. సీబీఐ దర్యాప్తును సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ ఉపశమనం దక్కలేదు.

Kolkata Doctor Case: సుప్రీంలో ఆర్‌‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌కు చుక్కెదురు..
Sandip Ghosh

ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. కాలేజీలో ఆర్థిక అవకతవకల అభియోగాలకు సంబంధించి తనపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడాన్ని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన భారత సర్వోన్నత న్యాయస్థానం సందీప్ ఘోష్ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఆర్ జీ కర్ ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగించింది. అయితే సందీప్ ఘోష్ ఆర్థిక అక్రమాలపై ఈడీ దర్యాప్తు కోరుతూ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తునకు అంగీకరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సందీప్ ఘోష్ సవాల్ చేయగా ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Minister: ఇండియా కూటమిలోనే డీఎంకే..


సీబీఐ కస్టడీలో..

ఆర్థిక అవకతవకల కేసులో ఆర్ జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం (సెప్టెంబర్ 2) రాత్రి అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ముగ్గురిని కోర్టులో ప్రవేశపెట్టగా 8 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సందీప్ ఘోష్‌తో పాటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొందరు నిందితులను సీబీఐ విచారిస్తోంది. సీబీఐ దర్యాప్తును సందీప్ ఘోష్ సుప్రీంకోర్టులో సవాల్ చేసినప్పటికీ ఉపశమనం దక్కలేదు. మరోవైపు ఈకేసు విచారణకు సంబంధించి బీజేపీ, టీఎంసీ మధ్య రాజకీయ విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. సీబీఐ కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కేసును పక్కదారి పట్టించడానికి, నిందితులను కాపాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ సీబీఐని ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.

Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..


టీఎంసీ డిమాండ్..

కోల్‌కతాలో ఆర్ జీ కర్ వైద్య కళాశాల జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు దర్యాప్తును వేగవంతం చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్ సీబీఐని కోరారు. ఈ కేసులో సీబీఐ ఎప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేస్తుందని ఆయన ఎక్స్‌లో ప్రశ్నించారు. త్వరితగతిన దర్యాప్తును పూర్తిచేయాలని కోరారు. వీలైనంత త్వరగా ఛార్జిషీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని, తృణమూల్ నేతల తీరును బీజేపీ తప్పుపడుతోంది. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని టీఎంసీ ఓ వైపు డిమాండ్ చేస్తూనే.. మరోవైపు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలతో కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్యకళాశాలలో జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే.


Dr. Tamilisai: పాలన చేతగాకే సైకిల్‌ తొక్కుతున్నారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 06 , 2024 | 01:09 PM