Share News

Delhi : కేరళ, బెంగాల్‌ గవర్నర్ల ఆఫీసులకు నోటీసులు

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:18 AM

పలు బిల్లుల పెండింగ్‌ విషయమై కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల గవర్నర్ల కార్యాలయాలకు సుప్రీం కోర్టు శుక్రవారంనోటీసులు జారీ చేసింది.

Delhi : కేరళ, బెంగాల్‌ గవర్నర్ల ఆఫీసులకు నోటీసులు

న్యూఢిల్లీ, జూలై 26: పలు బిల్లుల పెండింగ్‌ విషయమై కేరళ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల గవర్నర్ల కార్యాలయాలకు సుప్రీం కోర్టు శుక్రవారంనోటీసులు జారీ చేసింది. ఏ కారణం లేకుండా బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారంటూ ప్రతిపక్ష పాలిత కేరళ, బెంగాల్‌ ప్రభుత్వాలు వేసిన పిటిషన్లను సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ పార్ధివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం విచారించింది.

ఈ వ్యవహారంలో కేంద్ర హోంశాఖతో పాటు ఆయా రాష్ట్రాల గవర్నర్ల కార్యదర్శులకు కూడా నోటీసులు జారీ చేసింది. విచారణలో ఇరు రాష్ట్రాల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ‘శాసనసభలు ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్లు కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉంచారు. ఇందుకు కారణాలు కూడా వెల్లడించడం లేదు’ అని అన్నారు. దీనిపై స్పందించిన కోర్టు.. మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Jul 27 , 2024 | 04:18 AM