Share News

తీర్పులో వ్యాఖ్యలు సమీక్షించాలన్న గుజరాత్‌ పిటిషన్‌ తిరస్కరణ

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:41 AM

బిల్కి్‌సబానో కేసులో ముద్దాయిలను ముందస్తుగా విడుదల చేయడాన్ని కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలను సమీక్షించాలని కోరుతూ గుజరాత్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది

తీర్పులో వ్యాఖ్యలు సమీక్షించాలన్న గుజరాత్‌ పిటిషన్‌ తిరస్కరణ

  • బిల్కి్‌సబానో కేసులో సుప్రీంకోర్టు నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: బిల్కి్‌సబానో కేసులో ముద్దాయిలను ముందస్తుగా విడుదల చేయడాన్ని కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పులో చేసిన వ్యాఖ్యలను సమీక్షించాలని కోరుతూ గుజరాత్‌ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను గురువారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురయిన బిల్కి్‌సబానో కేసులో శిక్ష పడ్డ 11 మంది ముద్దాయిలను రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా విడుదల చేసింది.

ఆ నిర్ణయాన్ని ఈ ఏడాది జనవరిన సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ సందర్భంగా ఇచ్చిన తీర్పులో రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘అధికారాన్ని లాక్కోవడం’, ‘విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేయడం’ వంటి పదాలను ఉపయోగించింది. వీటిపై సమీక్ష జరపాలని కోరుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేసింది. ఈ పిటిషన్‌పై ఓపెన్‌ కోర్టులో విచారణ జరిగేలా లిస్టు చేయాలని కోరింది. పరిశీలించిన జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం ఎలాంటి సమీక్ష అవసరం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Updated Date - Sep 27 , 2024 | 06:26 AM