Share News

Delhi Excise Policy: సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Sep 05 , 2024 | 05:52 PM

ఢిల్లీ మద్యం విధానంలో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌తోపాటు తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ.. దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అందుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.

Delhi Excise Policy: సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 05: ఢిల్లీ మద్యం విధానంలో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌తోపాటు తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ.. దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అందుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ సీఎం కేజీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. అనంతరం ఈ కేసులో తీర్పును మంగళవారానికి సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది.

Also Read: Anam Venkata Reddy: ‘రోజక్కకి ఇంకా సిగ్గు రాలేదు’


ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌తోపాటు తనను అరెస్ట్ చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. తన తీర్పును సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: Hyderabad: జూబ్లీహిల్స్‌లో పలు రెస్టారెంట్లపై దాడులు.. కేసులు నమోదు


ఈ ఏడాది మర్చి 21వ తేదీన ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం తీహాడ్ జైలుకు ఆయన్ని తరలించింది. జూన్ 26న ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ క్రమంలో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ అప్పటికే ఆయన్ని సీబీఐ అరెస్ట్ చేయడంతో.. కేజ్రీవాల్ తీహాడ్ జైల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Also Read: Vinayaka Chavithi Special 2024: ముస్లిం దేశాల్లో పూజలందుకొంటున్న ‘గణపతి’


ఇక ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే జైల్లో ఉన్నారు. ఈ ఆగస్ట్‌లో ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టయిన ముగ్గురు.. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత, ఆప్ పార్టీ కమ్యూనికేషన్ మాజీ ఇన్‌‌ఛార్జ్ విజయ్ నాయర్‌లు బెయిలుపై విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో గతంలో అరెస్టయిన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే.

Also Read: Ravindra Jadeja: బీజేపీలో చేరిన స్టార్ క్రికెటర్.. ఫొటో షేర్ చేసిన రివాబా

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 05 , 2024 | 06:01 PM