Supreme Court: ఎన్నికల కారణంగా కేజ్రీవాల్ బెయిల్ అంశాన్ని పరిశీలిస్తాం: సుప్రీంకోర్టు
ABN , Publish Date - May 03 , 2024 | 06:35 PM
ఎన్నికల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారంనాడు పేర్కొంది. మే 7న పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదులకు జస్టిస్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఎన్నికల (Lok Sabha Elections_ కారణంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు తాత్కాలిక బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు (Supreme Court) శుక్రవారంనాడు పేర్కొంది. మే 7న పిటిషన్‌ను విచారిస్తామని తెలిపింది. వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని ఈడీ తరఫు న్యాయవాదులకు జస్టిస్ ఖన్నా, దీపంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
''కోర్టు బెయిల్ ఇస్తుందని ఇరువర్గాలు ఊహించవద్దు. బెయిల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ సీఎంకు తాత్కాలిక బెయిల్ ఇస్తే అమలు చేయాల్సిన షరతులతో ఈడీ మా ముందుకు రావాలి'' అని ధర్మాసనం పేర్కొంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి హోదాలో ఏ ఫైళ్లపై తకం పెట్టవచ్చనే విషయాన్ని కూడా పరిశీలించాలని ఈడీకి సూచించింది.
Lok Sabha Elections: చెస్, రాజకీయాల్లో రాహుల్ నిష్ణాతుడు... కాంగ్రెస్ కౌంటర్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో గత మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆయన బెయిలు కోసం చేసుకున్న అభ్యర్థన సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. లోక్‌సభ ఎన్నికల మందు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం సరికాదంటూ ఆయన తరఫున అభిషేక్ మను సింఘ్వి గత విచారణలో కీలక ప్రశ్న లేవనెత్తారు. దీనిపై సమాధానం ఇవ్వాలని ఈడీని సుప్రీంకోర్టు సైతం ఆదేశించింది.
Read Latest National News and Telugu News