Share News

Kolkata RG Kar Victim: సోషల్ మీడియలో ఫొటోలు వైరల్.. సుప్రీంకోర్టు విచారం

ABN , Publish Date - Sep 30 , 2024 | 07:44 PM

హత్యాచారానికి గురైన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైయినీ వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని సోషల్ మీడియాలో వైరల్ కాకుండా ఉండేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Kolkata RG Kar Victim: సోషల్ మీడియలో ఫొటోలు వైరల్.. సుప్రీంకోర్టు విచారం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: హత్యాచారానికి గురైన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని సోషల్ మీడియాలో వైరల్ కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

వైద్యురాలి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తమ కుమార్తెకు సంబంధించిన వీడియోలు సృష్టించారని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీంకోర్టు దృష్టికి ఈ సందర్భంగా తీసుకు వెళ్లారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం‌ పైవిధంగా స్పందించింది.

Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు బిగ్ రిలీఫ్


ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆమె చిత్రాలను రూపొందించి.. బాలీవుడ్ చిత్ర గీతాలను జోడించి రీల్స్‌గా రూపొందించారని ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది కరుణా నుండే కోర్టుకు తెలియజేశారు. రేపు యూట్యూబ్‌లో సైతం ఆమెకు సంబంధించిన వీడియోలు విడుదలవుతాయని మరో సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి ఈ కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు.

Also Read: Tirumala Laddu: దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి: సుప్రీం ధర్మాసనం

Also Read: Viral Video: మొసలి నోట్లో చెయ్యి పెట్టాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..


ఇటువంటి పరిస్థితుల్లో నోడల్ అధికారి జోక్యం చేసుకోని ఈ అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం అయితే ఉందని ఆమె పేర్కొన్నారు. ఓ వేళ వీటిని నిలుపుదల చేయాలను కుంటే చట్టపరంగా ముందుకు వెళ్లవచ్చని సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో నిలుపుదల చేసేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతోపాటు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని సీజేఐ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది.

Also Read: Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు.. జస్ట్ ఇలా చేయండి చాలు..

Also Read: Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..


ఆగస్ట్ 09వ తేదీ తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఆర్జీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైయినీ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో న్యాయం జరగాలంటూ పశ్చిమ బెంగాల్‌లోని జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.

Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు

Also Read: Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..

Also Read: ముందుగా టికెట్ బుక్ చేయకున్నా.. తిరుమల వెంకన్నను ఇలా ఈజీగా దర్శించుకోవచ్చు.. ఎలాగంటే..?


దీంతో వైద్య సిబ్బందితో ఇటీవల మమతా బెనర్జీ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ క్రమంలో వైద్య సిబ్బంది చేసిన పలు డిమాండ్లను సీఎం మమత ఆమోదించారు. దీంతో అత్యవసర వైద్య సేవలను కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు. అలాగే ట్రైయినీ వైద్యురాలి హత్యాచార కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

For National News And Telugu News..

Updated Date - Sep 30 , 2024 | 08:03 PM