Supreme Court: యోగి సర్కార్ 'బుల్డోజర్ యాక్షన్'పై సుప్రీం వార్నింగ్
ABN , Publish Date - Oct 22 , 2024 | 07:08 PM
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ఇటీవల మత ఘర్షణల అనంతరం పలువురికి యూపీ అధికారులు కూల్చివేతల నోటీసులు ఇచ్చారు. దీనిని సవాలు చేస్తూ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, జస్టిస్ బీఆర్ గావయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాననం విచారణ చేపట్టింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలపై (Bulldozer action) సుప్రీంకోర్టు (Suprme Court) మంగళవారంనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించి ప్రమాదంలో పడతామంటే అది మీ ఇష్టమని వ్యాఖ్యానించింది.
Waqf Bill: జేపీసీ మీటింగ్‌లో గ్లాస్ బాటిల్ విసిరికొట్టిన టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌లో ఇటీవల మత ఘర్షణల అనంతరం పలువురికి యూపీ అధికారులు కూల్చివేతల నోటీసులు ఇచ్చారు. దీనిని సవాలు చేస్తూ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, జస్టిస్ బీఆర్ గావయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాననం విచారణ చేపట్టింది. బుధవారం కూడా విచారణ సాగిస్తామని, అంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అక్రమ కట్టడాలు కూల్చివేతలో తాము జోక్యం చేసుకోమని, అయితే బుల్డోజర్ న్యాయం కుదరదని గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం గుర్తుచేసింది.
పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేట్ సీయూ సింగ్ తన వాదన వినిపిస్తూ, అక్టోబర్ 13 హింసాత్మక ఘటనల అనంతరం స్థానిక అధికారులు కూల్చివేతల నోటీసు ఇచ్చారని, మూడు రోజుల్లో స్పందించాలని అందులో పేర్కొన్నారని చెప్పారు. ఒక పిటిషనర్ తండ్రి, సోదరులు లొంగిపోయిన తర్వాత ఉద్దేశపూర్వకంగా అక్టోబర్ 17న నోటీసు జారీ చేసి, 18వ తేదీ సాయింత్ర నోటీసు అంటించారని, ఆదివారంనాడు తాము విచారణను కోరినప్పటికీ అది జరగలేదని, కొందరు హైకోర్టును ఆశ్రయించారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేకే నటరాజ్ స్పందిస్తూ, బుధవారం వరకూ ఎలాంటి చర్యలు తీసుకోమని యూపీ ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు. వెంటనే జస్టిస్ గవాయ్ ప్రతిస్పందిస్తూ, వారు (అధికారులు) మా ఆదేశాలను ఉల్లంఘించి రిస్క్ తీసుకోవాలనుకుంటే అది వారి ఇష్టమని హెచ్చరించారు. బుధవారం కూడా విచారణను కొనసాస్తామని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో బహ్రెయిచ్‌లో అక్టోబర్ 3న దుర్గా నిమజ్జన ఊరేగింపు ఒక మసీదు వద్దకు చేరినప్పుడు ఇరువర్ఘాల మధ్య ఘర్షణ చేటుచేసుకుంది. కొందరు దుకాణాలకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థిత తలెత్తింది. ఈ ఘర్షణల్లో రామ్ గోపాల్ మిశ్రా అనే వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. పోలీసులు 104 మందిని అరెస్టు చేసి 23 దుకాణాల కూల్చివేతకు నోటీసులిచ్చారు.
ఇవి కూడా చదవండి..
Lawrence Bishnoi: అతడిని ఎన్ కౌంటర్ చేస్తే కోటి రివార్డు.. పోలీసులకు కర్ణిసేన ఓపెన్ ఆఫర్..
Bomb Threats: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో సీఆర్‌పీఎఫ్ పాఠశాలలకు బాంబు బెదిరింపులు
Submarine: భారత అమ్ముల పొదిలోకి ఎస్ఎస్‌బీఎన్ ఎస్-4 అణు జలాంతర్గామి..
Read More National News and Latest Telugu News