Share News

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో మరో ట్విస్ట్.. గ్యాంగ్ రేప్‌పై సీబీఐ క్లారిటీ ఇచ్చిందా

ABN , Publish Date - Sep 06 , 2024 | 02:11 PM

కోల్‌కతా ఆర్ జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు రేకెత్తాయి.

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో మరో ట్విస్ట్.. గ్యాంగ్ రేప్‌పై సీబీఐ క్లారిటీ ఇచ్చిందా
CBI

కోల్‌కతా ఆర్ జీ కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ అభయ హత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకు గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చనే అనుమానాలు రేకెత్తాయి. సీబీఐ దర్యాప్తు తర్వాత అభయ హత్యాచారం కేసు ఓ కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుమానించినట్లు గ్యాంగ్ రేప్ జరగలేదని సీబీఐ దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది. సంజయ్ రాయ్‌ను ఏకైక నిందితుడిగా గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తోంది. ఆర్ జీ కర్ వైద్య కళాశాలలో 31 ఏళ్ల జూనియర్ డాక్టర్ అభయపై గ్యాంగ్ రేప్‌‌ను సీబీఐ తోసిపుచ్చింది. సంజయ్ రాయ్ ఒక్కడే నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తు చివరి దశలో ఉండగా.. త్వరలోనే సీబీఐ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. అభయ హత్యాచారం తర్వాత నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. మరోవైపు అభయ హత్యాచారం తర్వాత బెంగాల్ ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన తర్వాత బెంగాల్ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థపై ఒత్తిడి తెస్తోంది. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని, నేరానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో గ్యాంగ్ రేప్ జరగలేదని, కేవలం ఒక వ్యక్తి మాత్రమే నేరానికి పాల్పడినట్లు సీబీఐ తన దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.

Minister: ఇండియా కూటమిలోనే డీఎంకే..


గ్యాంగ్ రేప్ అంటూ..

జూనియర్ డాక్టర్ అభయపై గ్యాంగ్ రేప్ జరిగి ఉండవచ్చని.. ఆ తర్వాత హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు తలెత్తాయి. ఘటన తర్వాత ఆధారాలు మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. హత్యాచారం తర్వాత వెంటనే సెమినార్ హాల్‌తో పాటు ఆసుపత్రిలో మరమ్మతులు చేయించారని.. ఆధారాలు లభించకుండా అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు ఆధారంగా సామూహిక అత్యాచారం జరిగిందనడానికి ఆధారాలు దొరకనట్లు తెలుస్తోంది. దీంతో సంజయ్ రాయ్‌ ఒక్కడినే సీబీఐ నిందితుడిగా పేర్కొన్నట్లు కథనాలు వస్తున్నాయి.

Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..


మమతా బెనర్జీ వాదన ఇదే..!

అభయ హత్యాచారం కేసు దర్యాప్తును ఐదు రోజుల్లో పూర్తి చేస్తామని తమ ప్రభుత్వం చెప్పినప్పటికీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించినట్లు మమతా బెనర్జీ తెలిపారు. బాధిత కుటుంబానికి, న్యాయం కోరుతున్న ప్రజలకు సత్వర న్యాయం అవసరం లేదని, ఆలస్యాన్ని కోరుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. సీబీఐ దర్యాప్తు చేపట్టింది. న్యాయం ఏదంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు. జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసుకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్ మంత్రి బ్రత్యా బసు డిమాండ్ చేశారు. ఇప్పటికే 23 రోజులు గడిచిపోయాయని సీబీఐ దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదన్నారు. సీబీఐ విచారణకు సంబంధించిన వివరాణాత్మక నివేదికను తమ ప్రభుత్వం కోరుతుందన్నారు. ఈ కేసు దర్యాప్తును కోల్‌కతా పోలీసులు చేపట్టినప్పుడు ఎప్పటికప్పుడు దర్యాప్తు పురోగతిని ప్రజల ముందుంచామని మంత్రి బ్రత్యా బసు తెలిపారు.


Dr. Tamilisai: పాలన చేతగాకే సైకిల్‌ తొక్కుతున్నారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News Click Here

Updated Date - Sep 06 , 2024 | 02:36 PM