Share News

AIG kills son-in-law: కోర్టులోనే సొంత అల్లుడిని కాల్చిచంపిన మాజీ ఏఐజీ

ABN , Publish Date - Aug 03 , 2024 | 08:42 PM

చండీగఢ్ కోర్టులో శనివారంనాడు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదాల కారణంగా కోర్టుకు వచ్చిన అల్లుడిపై సొంత మామయ్య కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోగా, హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

AIG kills son-in-law: కోర్టులోనే సొంత అల్లుడిని కాల్చిచంపిన మాజీ ఏఐజీ

చండీగఢ్: చండీగఢ్ కోర్టులో శనివారంనాడు అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కుటుంబ వివాదాల కారణంగా కోర్టుకు వచ్చిన అల్లుడిపై సొంత మామయ్య కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలు కోల్పోగా, హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు.


ఘటన వివరాలు...

ఇండియన్ సివిల్ అకౌంట్స్ ఆఫీసర్‌ (ఐసీఏఎస్)గా హర్‌ప్రీత్ సింగ్ పని చేస్తున్నారు. ఆయన మామయ్య మల్వీందర్ సింగ్ పంజాబ్ పోలీసు శాఖలో అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఏఐజీ)గా పనిచేస్తూ కొద్దికాలం క్రితం సస్పెండయ్యారు. మల్వీందర్ సింగ్ కుమార్తె డాక్టర్ అమిత్ జోత్ కౌర్‌ను హర్‌ప్రీత్ పెళ్లాడారు. ఇద్దరి మధ్య వివాహానికి సంబంధించి వివాదం నడుస్తోంది. మధ్యవర్తిత్వ వ్యవహారంపై ఫ్యామిలీ కోర్టుకు శనివారంనాడు హర్‌ప్రీత్, మల్వీందర్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఆ సమయంలో తాను వాష్‌రూమ్‌కు వెళ్లాలని, తనకు దారి చూపించమని హర్‌ప్రీత్‌ను మల్విందర్ కోరాడు. కొద్ది సేపటికే మల్విందర్ తుపాకి బయటకు తీసి హర్‌ప్రీత్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ నేరుగా ఛాతీలోకి దూసుకుపోతుండగా అక్కడికక్కడ హర్‌ప్రీత్ కుప్పకూలాడు. రక్తపు మడుగులో ఉన్న అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న బంధువులు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లా కోర్టు కాంప్లెక్‌లో తీవ్ర కలకలం రేపింది.

Updated Date - Aug 03 , 2024 | 08:42 PM