Share News

Fake baba: ఆయన దొంగ బాబా.. ఆధారం ఇదిగో..!

ABN , Publish Date - Jul 21 , 2024 | 09:29 PM

ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న స్వామి అవిముక్తేశ్వరానంద్‌పై జ్యోతిర్మఠం ట్రస్టుకు చెందిన స్వామి శ్రీ గోవిందానంద సరస్వతి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిముక్తేశ్వరానంద్ ఒక 'నకిలీ బాబా' అని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ వత్తాసుగా ఉందని చెప్పారు.

Fake baba: ఆయన దొంగ బాబా.. ఆధారం ఇదిగో..!

న్యూఢిల్లీ: ఇటీవల వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తున్న స్వామి అవిముక్తేశ్వరానంద్ (Swami Avimukteshwaranand) పై జ్యోతిర్మఠం ట్రస్టుకు చెందిన స్వామి శ్రీ గోవిందానంద సరస్వతి మహరాజ్ (Govindananda saraswati Maharaj) సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిముక్తేశ్వరానంద్ ఒక 'నకిలీ బాబా' అని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ వత్తాసుగా ఉందని చెప్పారు.


''అవిముక్తేశ్వరానంద్ అనే నకిలీ బాబా ఉన్నారు. ప్రధానమంత్రి ఆయన పాదాలకు మొక్కుతారు. అంబానీ వంటి పారిశ్రామికవేత్తలు ఆయనను తమ ఇంటికి ఆహ్వానిస్తారు. అవిముక్తేశ్వరానంద్ ఫేక్ నెంబర్-1. శంకరాచార్య పేరు మాట అటుంచండి, కనీసం ఆయన సాధు, సంత్, సన్యాసి కూడా కాదు'' అని మీడియాతో మాట్లాడుతూ గోవిందానంద సరస్వతి మహరాజ్ చెప్పారు.


అవిముక్తేశ్వరానంద్‌ విషయంలో వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వును గోవిందానంద సరస్వతి మహరాజ్ చూపిస్తూ, అవిముక్తేశ్వరానంద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని, ఆయన పరారీలో ఉన్నారని చెప్పారు. చాలాకాలంగా ఆయన వారణాసికి రాలేదని, మధ్యప్రదేశ్‌లో తలదాచుకుంటున్నారని, మఠం ఆయనను మందలించడంతో ఆయన తిరిగి తమపైనే కేసు పెట్టారని వెల్లడించారు. ఈ విషయాలన్నీ తాము సుప్రీంకోర్టుకు చెప్పాలనుకుంటున్నప్పటికీ కోర్టు వాయిదాలు వేస్తూ వస్తోందని, తాము న్యాయం కోరుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఆయనకు ఉందని కూడా స్వామి గోవిందానంద సరస్వతి మహరాజ్ ఆరోపించారు.


జ్యోతిర్మఠం శంకరాచార్యగా ప్రచారంలో ఉన్న అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఇటీవల కేథార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైనట్టు మీడియాకు వెల్లడించారు. దీనికి ముందు ముంబైలోని మాతోశ్రీ నివాసంలో శివసేన యూబీటీ నేత ఉద్ధవ్ థాకరేను ఆయన కలుసుకుని ఆశీర్వచనం ఇచ్చారు. ఉద్ధవ్ థాకరే వంచనకు గురై ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని, వంచన అనేది సనాతన సంప్రదాయంలో అత్యంత పెద్ద పాపమని చెప్పారు. తిరిగి ఆయన సీఎం పగ్గాలు చేపట్టాలని అభిలషించారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 21 , 2024 | 09:30 PM