Swati Maliwal assault case: సీఎం సహాయకుడికి 3 రోజుల పోలీస్ కస్టడీ
ABN , Publish Date - May 28 , 2024 | 08:39 PM
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు 3 రోజుల పోలీసు కస్టడీకి ఢిల్లీ తీజ్ హజారీ కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal)పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ (Bihav kumar)కు 3 రోజుల పోలీసు కస్టడీకి ఢిల్లీ తీజ్ హజారీ కోర్టు మంగళవారంనాడు ఆదేశించింది. కుమార్‌ను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరగా, ఆ విజ్ఞప్తిని కుమార్ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. తన క్లయింట్‌పై ఎలాంటి సాక్ష్యాలు లేనందున ఆయనను కస్టోడియల్ ఇంటరాగేషన్‌కు ఇవ్వాలనడం సరికాదని ఆయన వాదించారు. కాగా, దీనికి ఒకరోజు ముందు కుమార్ బెయిల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.