Share News

Hooch tragedy: 56కి చేరిన కల్తీసారా మృతుల సంఖ్య.. బాధితులను పరామర్శించిన కమల్

ABN , Publish Date - Jun 23 , 2024 | 05:57 PM

తమిళనాట తీవ్ర విషాదాన్ని నింపిన కల్తీ సారా బాధితులకు మక్కల్ నీది మయ్యమ్ అధినేత, హీరో కమల్ హాసన్ భరోసా ఇచ్చారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం ఆయన పరామర్శించారు.

Hooch tragedy: 56కి చేరిన కల్తీసారా మృతుల సంఖ్య.. బాధితులను పరామర్శించిన కమల్

తమిళనాడు: తమిళనాట తీవ్ర విషాదాన్ని నింపిన కల్తీ సారా బాధితులకు మక్కల్ నీది మయ్యమ్ అధినేత, హీరో కమల్ హాసన్(Kamal Haasan) భరోసా ఇచ్చారు. కళ్లకురిచ్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సంందర్భంగా బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపారు.

చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హూచ్ దుర్ఘటనలో మృతుల సంఖ్య 56కి చేరిందని జిల్లా యంత్రాంగం ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. కలెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నాలుగు వేర్వేరు ఆసుపత్రుల్లో 216 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.


నిందితుడి అరెస్ట్..

తమిళనాడు కల్లకురిచ్చి జిల్లాలోని కల్తీ సారా సరఫరా కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. జిల్లాలోని కరుణాపురం గ్రామానికి చిన్నదురై అనే వ్యక్తి కల్తీ లిక్కర్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ప్రతి రోజూ గ్రామంలో మరణాలు సంభవిస్తున్నాయని, మరికొంత మంది పలు హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారని వైద్యులు తెలిపారు.

రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ గోకుల్‌‌దాస్‌‌ కమిషన్‌‌ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. మరో మూడు నెలల్లో సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక అందించనున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు పోలీసు అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేయగా, కలెక్టర్‌‌‌‌ను బదిలీ చేసింది. రాష్ట్రంలో అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపుతానని సీఎం స్టాలిన్‌‌ స్పష్టం చేశారు. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ స్టాలిన్‌‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌‌ చేస్తున్నాయి.

For Latest News and National News click here

Updated Date - Jun 23 , 2024 | 05:57 PM