Maternity Leaves: ఈ మహిళలకు ఏడాదిపాటు ప్రసూతి సెలవులు.. సీఎం కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 24 , 2024 | 08:02 AM
రాష్ట్రంలోని మహిళా పోలీసులకు(women police) ఒక సంవత్సరం ప్రసూతి సెలవులు(Maternity Leaves) ఇస్తామని తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అంతేకాదు వీరికి మరిన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని వెల్లడించారు.
ఇకపై రాష్ట్రంలోని మహిళా పోలీసులకు(women police) ఒక సంవత్సరం పాటు ప్రసూతి సెలవులు(Maternity Leaves) ఇస్తామని తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) శుక్రవారం ప్రకటించారు. చెన్నైలోని రాజరథినం స్టేడియంలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్రపతి పతకం, కేంద్ర హోంమంత్రి పతకాలు అందజేసిన క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు ప్రసూతి సెలవు తర్వాత తిరిగి విధుల్లో చేరిన మహిళా పోలీసులకు వారి తల్లిదండ్రులు లేదా భర్త స్వగ్రామంలో వారి ఎంపిక ప్రకారం మూడేళ్లపాటు ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
పోలీసు శాఖ సిబ్బంది అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత డీఎంకే ప్రభుత్వం ఉద్యోగులకు ప్రసూతి సెలవులను తొమ్మిది నెలల నుంచి ఏడాదికి పెంచడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలి
మీ కర్తవ్యం, బాధ్యత చాలా పెద్దదని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీరు ప్రజలను రక్షించాలన్నారు. దీంతోపాటు మీ విధులను కూడా అంకితభావంతో నిర్వహించాలన్నారు. నేరాలను తగ్గించడానికి మాత్రమే కాకుండా నేరాలను నిరోధించే విధంగా పని చేయాలని సూచించారు. తమిళనాడును డ్రగ్స్, నేరాలు లేని రాష్ట్రంగా మార్చాలని స్టాలిన్(MK Stalin) కోరారు. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను ఎదుర్కొనేందుకు మహిళా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించి సైబర్ నేరాలను మరింత సమర్థవంతంగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి తెలిపారు.
కవాతు
ఈ కార్యక్రమంలో పోలీసులకు రాష్ట్రపతి పతకాలు, కేంద్ర హోంశాఖ పతకాలు, ముఖ్యమంత్రి(Chief Minister) పతకాలు అందజేశారు. హోంగార్డు నుంచి 7, అగ్నిమాపక శాఖ నుంచి 14, జైళ్ల శాఖ నుంచి 8 మంది కానిస్టేబుళ్లకు పతకాలు అందజేశారు. మొత్తం 158 కేంద్ర ప్రభుత్వ పతకాలు, 301 ముఖ్యమంత్రి పతకాలు లభించాయి. ఈ సందర్భంగా పోలీసుల కవాతు సన్మానాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వీకరించారు. వచ్చిన పోలీసులను ముఖ్యమంత్రి సన్మానించారు.
మిగతా రాష్ట్రాలు
గార్డుల పతక వేడుకలో పోలీసులు అద్భుతమైన సాహస విన్యాసాలు చేశారు. ద్విచక్రవాహనాలపై నిర్వహించిన సాహసం కన్నుల పండువగా సాగింది. అయితే తమిళనాడులో ఏడాదిపాటు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మిగతా రాష్ట్రాల మహిళా పోలీసులు కూడా తమకు ఇదే విధానాన్ని ప్రకటించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి:
Health Department : స్నాతకోత్సవాల కోసం భారతీయ దుస్తులు
Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..
Tourist Place: వీకెండ్ విజిట్‌కు బెస్ట్ ప్లేస్ .. ట్రేక్కింగ్, కాఫీ తోటలతోపాటు..
Read More National News and Latest Telugu News