Share News

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. నేడు ప్రమాణం

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:32 AM

తమిళనాడు సీఎం స్టాలిన్‌ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు.

డిప్యూటీ సీఎంగా ఉదయనిధి.. నేడు ప్రమాణం

చెన్నై, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం స్టాలిన్‌ తనయుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. తన మంత్రివర్గాన్ని విస్తరించడంలో భాగంగా స్టాలిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు పదవీ ప్రమాణం చేస్తారు. ఉదయనిధితోపాటు సేంథిల్‌ బాలాజీ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఓ అవినీతి కేసులో అరెస్టు అయిన సేంథిల్‌ బాలాజీని మంత్రిగా గవర్నర్‌ తొలగించిన విషయం తెలిసిందే.

Updated Date - Sep 29 , 2024 | 04:32 AM