Kathua: ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడిలో నలుగురు జవాన్ల మృతి
ABN , Publish Date - Jul 08 , 2024 | 08:54 PM
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లా మాచోడి ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో విషాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
కథువా: జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) లోని కథువా (Kathua) జిల్లా మాచోడి ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడి (Terrorists attack) లో విషాదం చోటుచేసుకుంది. భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఆర్మీ వాహనాలు లక్ష్యంగా జరిగిన ఈ ఉగ్రదాడితో అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. దీంతో అదనపు బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతన్ని తమ అధీనంలోకి తీసుకుని టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నాయి. కాగా, గాయపడిన జవాన్లను కథువా జిల్లాలోని మిలటరీ ఆసుపత్రికి తరలించారు.
Shankaracharya: రాహుల్‌కు బాసటగా జ్యోతిర్ మఠం శంకరాచార్య
హిజ్బుల్‌కు చావుదెబ్బ
కాగా, సౌత్ కశ్మీర్‌లో గత రెండు మూడ్రోజులుగా చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్లలో ఆరుగురు నక్సల్స్‌ను మట్టుబెట్టామని, దీంతో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చావుదెబ్బ తగిలిందని బిగ్రేడియర్ ప్రుధ్వీరాజ్ చౌహన్ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో ఆర్మీ సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. గత కొన్ని వారాలుగా జమ్మూకశ్మీర్‌లో తీవ్రవాదుల దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. జూలైలో దోడా జిల్లాలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు టెర్రరిస్టులను బలగాలు మట్టుబెట్టాయి.
For Latest News and National News click here