Terrorists attack: ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టుల దాడి.. రెండ్రోజుల్లో ఇది రెండోసారి
ABN , Publish Date - Jul 08 , 2024 | 05:03 PM
జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లా భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా వీటిని తిప్పికొట్టాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కతువా (Kathua) జిల్లా భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. తొలుత గ్రనేడ్ విసిరిన టెర్రరిస్టులు ఆ తర్వాత కాల్పులు జరిపిట్టు చెబుతున్నారు. బిల్లావార్ తహసిల్‌లోని లోహైమల్హార్ బ్లాక్ మచ్చేడి ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగింది. వెంటనే అదనపు బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలపై టెర్రరిస్టులు దాడి జరపడం గత రెండ్రోజుల్లో ఇది రెండవది. దీనికి ముందు కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లపై ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది.
Read Latest National News and Telugu News