S Jaishankar: ఉగ్రవాదులకు వాళ్ల భాషలోనే సమాధానం ఇవ్వాలి: జైశంకర్
ABN , Publish Date - Apr 13 , 2024 | 05:02 PM
సరిహద్దు ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ అన్నారు. ఉగ్రవాదులకు ఎలాంటి నిబంధనలు ఉండవని, వారికి వారి భాషలోనే సమధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: సరిహద్దు ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar అన్నారు. ఉగ్రవాదులకు ఎలాంటి నిబంధనలు (Rules) ఉండవని, వారికి వారి భాషలోనే సమధానం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.
ముంబైలోని పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడుతూ, గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. దాయాది దేశమైన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ, సరిహద్దులకు ఆవల ఉన్నామని, తమను ఎవరూ ఏమీ చేయలేదని ముష్కరులు అనుకుంటే అందుకు దీటుగా మనం జవాబు చెప్పాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదులు ఎవరూ కూడా రూల్స్ పెట్టుకుని దాడులు చేయరని, అలాంటప్పుడు ప్రతిచర్యల కూడా ఎలాంటి నియమాలకు లోబడి ఉండాల్సిన పనే లేదని తెగేసి చెప్పారు.
Lok Sabha Polls: మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో రెడీ
''నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రిగా వచ్చారు. కానీ సమస్య 2014లో మొదలు కాలేదు. 1947లోనే మొదలైంది. అప్పుడే కశ్మీర్‌లోకి అడుగుపెట్టిన పాక్ ఉగ్రవాదులు కశ్మీరీలపై దాడులు చేశారు. 26/11 ముంబై ఉగ్రదాలను ప్రస్తావిస్తూ, యూపీఏ ప్రభుత్వం అప్పట్లో పలు రౌండ్లు చర్చలు జరిపిందని, అయితే పాకిస్థాన్‌పై దాడి చేయడం కంటే, మిన్నకుండటం వల్లే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నారు. ముంబై దాడుల వంటి ఘటనలు జరిగినప్పుడు, దానిపై స్పందించనప్పుడు, ఆ తర్వాత జరిగే దాడులను ఎలాం నిరోధించగలమని ఆయన ప్రశ్నించారు. టెర్రరిస్టుల దాడులకు ఎలాంటి రూల్స్ ఉండవని, వారి చర్యలకు ప్రతీకార చర్యలు కూడా అదే తరహాలో ఉండాలని జైశంకర్ పునరుద్ఘాటించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం