Share News

Supreme Court: రోహింగ్యాలకు భారతదేశంలో చోటు లేదు.. సుప్రీంకు వెల్లడించిన కేంద్రం..

ABN , Publish Date - Mar 20 , 2024 | 05:57 PM

భారతదేశంలోని రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అస్సలు జరగదని స్పష్టం చేసింది. వారికి ఇండియాలో స్థిరపడే హక్కు లేదని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ( Supreme Court ) కు తెలిపింది.

Supreme Court: రోహింగ్యాలకు భారతదేశంలో చోటు లేదు.. సుప్రీంకు వెల్లడించిన కేంద్రం..

భారతదేశంలోని రోహింగ్యా ముస్లింలకు శరణార్థుల హోదా కల్పించాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇది అస్సలు జరగదని స్పష్టం చేసింది. వారికి ఇండియాలో స్థిరపడే హక్కు లేదని వివరించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ( Supreme Court ) కు తెలిపింది. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. రోహింగ్యాల అక్రమ వలసలు భారత్‌కు అంతర్గత భద్రత దృష్ట్యా ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో సుప్రీంకోర్టుకు పలు నిర్ణయాలను తెలిపారు. ఆర్టికల్ 21 ప్రకారం విదేశీ పౌరులు భారతదేశంలో సంచరించవచ్చు. కాని వారికి భారతదేశంలో స్థిరపడే హక్కు లేదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ ( యూఎన్‌హెచ్ఆర్‌సీ ) శరణార్థి కార్డుతో రోహింగ్యా ముస్లింలు వస్తున్నారు. భారతదేశం ఇప్పటికే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల సమస్యను ఎదుర్కొంటోంది. ఈ పరిణామం అసోం, పశ్చిమ్ బంగ రాష్ట్రాల జనాభా పరిస్థితిని మార్చింది. ఆయా రాష్ట్రాల్లో జనాభా పెరిగిపోయింది. ఫలితంగా అంతర్గత భద్రత సమస్యలు వస్తున్నాయి.


మరోవైపు.. నిర్బంధంలో ఉన్న రోహింగ్యాలను విడుదల చేయాలంటూ ప్రియాలీ సుర్ వేసిన పిటిషన్‌పై సైతం ప్రభుత్వం స్పందించింది. భారత్ లో నివసిస్తున్న రోహింగ్యాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేసింది. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై విదేశీ యాక్ట్‌లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వివరించింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 05:57 PM