Share News

Medicines Ban: 156 మెడిసిన్లను నిషేధించిన ప్రభుత్వం.. వీటిలో పారాసెటమాల్ సహా..

ABN , Publish Date - Aug 23 , 2024 | 11:51 AM

కేంద్ర ప్రభుత్వం(central government) గురువారం రోజు 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులను నిషేధించింది. వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, మల్టీవిటమిన్ మందులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ఏయే మందులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Medicines Ban: 156 మెడిసిన్లను నిషేధించిన ప్రభుత్వం.. వీటిలో పారాసెటమాల్ సహా..
central government has banned 156 medicines

కేంద్ర ప్రభుత్వం(central government) గురువారం రోజు 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులను నిషేధించింది. వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, మల్టీవిటమిన్ మందులు కూడా ఉన్నాయి. ఈ మందులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని పరిశోధనలో తేలింది. ఈ క్రమంలో ఈ మందుల తయారీ, విక్రయం, పంపిణీని పూర్తిగా నిషేధిస్తున్నామని(Medicines Ban) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.


నిపుణుల సలహా మేరకే

నిషేధించబడిన FDC మందులలో యాంటీబయాటిక్స్, యాంటీ అలెర్జీలు, పెయిన్ కిల్లర్లు, మల్టీవిటమిన్లు, జ్వరం, అధిక రక్తపోటు కోసం ఉపయోగించే మందులు ఉన్నాయి. డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు (DTAB), కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటీసులో పేర్కొన్నారు.


పారాసెటమాల్ సహా

ప్రధాన FDC ఔషధాల జాబితాలో మెఫెనామిక్ యాసిడ్ కూడా చేర్చబడింది. ఈ మందులు వివిధ పరిస్థితులలో నొప్పి, వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఒమెప్రజోల్ మెగ్నీషియం, డైసైక్లోమైన్ హెచ్‌సీఎల్ సప్లిమెంట్స్, వీటిని కడుపు నొప్పి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఈ నిషేధిత జాబితాలో 'Aceclofenac 50mg + Paracetamol 125mg టాబ్లెట్స్ ఉన్నాయి.

ఈ జాబితాలో..

ఈ జాబితాలో మెఫెనామిక్ యాసిడ్ + పారాసెటమాల్ ఇంజెక్షన్, సెటిరిజైన్ హెచ్‌సీఎల్ + పారాసెటమాల్ + ఫినైల్‌ఫ్రైన్ హెచ్‌సీఎల్, లెవోసెటిరిజైన్ + ఫినైల్‌ఫ్రైన్ హెచ్‌సిఎల్ + పారాసెటమాల్, పారాసెటమాల్ + క్లోర్‌ఫెనిరమైన్ మలేట్ + ఫినైల్ ప్రొపనోలమైన్, కామిలోఫిన్ డైహైడ్‌రోక్లోరైడ్ 25 మి.గ్రా. ఉన్నాయి. దీంతోపాటు పారాసెటమాల్, ట్రామడాల్, టౌరిన్, కెఫిన్ కలయికను కూడా కేంద్రం నిషేధించింది. ట్రామాడోల్ ఓపియాయిడ్ ఆధారిత నొప్పి నివారిణి.


లివర్‌ను నయం చేసే మందులు

ఇతర FDCలలో ursodeoxycholic యాసిడ్, మెట్‌ఫార్మిన్ HCl కలయిక ఉంది. డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఫ్యాటీ లివర్‌ చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులను నివారించడానికి, చికిత్స చేయడానికి పోవిడోన్ అయోడిన్, మెట్రోనిడాజోల్, కలబంద సప్లిమెంట్లను ఉపయోగిస్తారు.


ఈ మందులు కూడా నిషేధం

ursodeoxycholic యాసిడ్, మెట్‌ఫార్మిన్ HCl FDCల ప్రధాన బ్రాండ్‌లలో Aris Lifesciences ద్వారా తయారు చేయబడిన Heprexa M మాత్రలు ఉన్నాయి. Maxun Biotech's Macdin AM Ointment, Medcure Pharma's Poviol M Ointment పోవిడోన్ అయోడిన్, మెట్రోనిడాజోల్, కలబంద మిశ్రమ మోతాదులకు సాధారణంగా అందుబాటులో ఉన్న ఉదాహరణలు.


ఉపయోగించడం వల్ల

ఔషధానికి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ఎఫ్‌డీసీలను ఉపయోగించడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. DTAB ఈ ఔషధాల వాదనలు సమర్థనీయమని గుర్తించలేదని, రోగికి కలిగే ప్రయోజనాల కంటే, వాటి వల్ల కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని నోటీసులో పేర్కొంది. దీంతో పాటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26A ప్రకారం ఈ ఎఫ్‌డీసీ తయారీ, అమ్మకం లేదా పంపిణీని నిషేధించడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

High court of Mumbai : ప్రజాగ్రహంతో కానీ కేసు నమోదు చేయరా?


Delhi : 7 వేల కోట్లతో సైన్యానికి ఆయుధాలు


Read More National News and Latest Telugu News

Updated Date - Aug 23 , 2024 | 11:59 AM