Delhi: ముగిసిన మూడో దశ ఎన్నికల ప్రచారం..
ABN , Publish Date - May 06 , 2024 | 04:43 AM
మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.
అహ్మదాబాద్/బెంగళూరు, మే 5: మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఎన్నికలు జరిగే గుజరాత్, ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో చాలా చోట్ల గతంలో బీజేపీయే గెలుపొందింది.
ఈ దశలో కేంద్ర మంత్రులు అమిత్ షా (అహ్మదాబాద్), సింధియా(గుణ), మాండవీయ(పోర్‌బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్) పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మాజీ సీఎంలు శివరాజ్(విదీశ), దిగ్విజయ్(రాజ్‌ఘర్), కర్ణాటక మాజీ సీఎం బొమ్మై (హవేరీ) కూడా ఈ దశలోనే బరిలో ఉన్నారు.