Share News

The Wire: గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్‌

ABN , Publish Date - May 08 , 2024 | 09:20 AM

కాంగ్రెస్‌గానీ, ఇండియా కూటమిగానీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను మహిళల మెడలో మంగళసూత్రాలతో సహా లాక్కొని ముస్లింలకు పంచుతారని, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి వాటిని ముస్లింలకు ఇస్తారని ప్రధాని మోదీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముస్లింలకు ఎంతమాత్రం రిజర్వేషన్లు ఇవ్వటానికి వీల్లేదని, తాను బతికుండగా ఆ పనికి అవకాశం ఇవ్వబోనని తేల్చి చెబుతున్నారు.

The Wire: గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్‌

  • మోదీ సీఎంగా ఉన్నప్పుడే అమలు

  • 2022లో ఓ ఇంటర్వ్యూలో ప్రధాని స్వయంగా వెల్లడి

  • న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘వైర్‌’ కథనం

న్యూఢిల్లీ, మే 7: కాంగ్రెస్‌గానీ, ఇండియా కూటమిగానీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులను మహిళల మెడలో మంగళసూత్రాలతో సహా లాక్కొని ముస్లింలకు పంచుతారని, బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను తగ్గించి వాటిని ముస్లింలకు ఇస్తారని ప్రధాని మోదీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ముస్లింలకు ఎంతమాత్రం రిజర్వేషన్లు ఇవ్వటానికి వీల్లేదని, తాను బతికుండగా ఆ పనికి అవకాశం ఇవ్వబోనని తేల్చి చెబుతున్నారు.

అయితే, ప్రధాని మోదీ చెబుతున్న మాటలకు గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు ఆయన అమలు చేసిన విధానాలకు పొంతన లేకపోవటం విశేషం. మోదీ గుజరాత్‌ సీఎంగా ఉండగా ఆ రాష్ట్రంలోని ముస్లింలకు బీసీ కోటాలో రిజర్వేషన్‌ కల్పించారు. దీని గురించి ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు న్యూస్‌ వెబ్‌సైట్‌ ‘వైర్‌’ ఒక కథనాన్ని ప్రచురించింది.


దీని ప్రకారం.. 2022 ఫిబ్రవరి 9వ తేదీన ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ మాట్లాడుతూ.. గుజరాత్‌లోని ముస్లింలలో 70 వర్గాలు బీసీ జాబితాలో ఉన్నాయని, తాను సీఎంగా ఉన్నప్పుడు వారందరూ బీసీ రిజర్వేషన్‌ ప్రయోజనాలను పొందారని పేర్కొన్నారు. అటువంటప్పుడు, కాంగ్రెస్‌ను, ఇండియా కూటమిని ఎలా వేలెత్తి చూపుతారన్న ప్రశ్న ముందుకొస్తోంది.

అంతేకాదు, బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ కూటమిలో ఉన్న పార్టీలు సైతం ముస్లింల రిజర్వేషన్ల పట్ల సానుకూలంగా ఉన్నాయి. కర్ణాటకలో ముస్లింలకు బీసీ రిజర్వేషన్లను తొలిసారిగా హెచ్‌డీ దేవెగౌడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించామని జేడీఎస్‌ చెప్పుకుంటోంది. ఆ పార్టీ ఎన్‌డీఏ ప్రధాన పార్టీలో ఒకటి. ఇక కూటమిలో ఇటీవలే చేరిన మరో ప్రధాన పార్టీ తెలుగుదేశం కూడా.. ఏపీలో ముస్లింలకు బీసీ కోటా కింద 4% రిజర్వేషన్‌ను కొనసాగిస్తామని ప్రకటించింది.

ఇది కూడా చదవండి:

West Bengal: నియామకాల రద్దుపై స్టే.. కానీ సీబీఐ విచారణ జరపండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 09:20 AM