Share News

National: యూపీపై యోగి ప్రజెంటేషన్.. మోదీ రిప్లై మామూలుగా లేదుగా..!

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:53 PM

సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ఈ సమావేశం జరిగింది.

National: యూపీపై యోగి ప్రజెంటేషన్.. మోదీ రిప్లై మామూలుగా లేదుగా..!
Modi

సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ఈ సమావేశం జరిగింది. 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 ఎన్డీయే పాలిత రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు మూడు గంటలకు పైగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రులందరూ తమ తమ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకాలు ఏ విధంగా అమలుచేస్తున్నారనేది ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదే విధంగా ఇటీవల జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల ఫలితాలపై కొద్దిసేపు సమీక్షించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని, ఎన్నికల్లో పార్టీ పనితీరు సంతృప్తిగా ఉందని మోదీ తెలిపారు. ఏ ఒక్కరూ అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదని ప్రధాని మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. గుండెలు బరువు చేసుకుని బాధపడాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు.

Read Also: Rahul Gandhi: చెప్పులు కుట్టే వ్యక్తికి రాహుల్ ఊహించని సాయం..


సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలపై దృష్టి..

అయోధ్య, వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని మహాకాల్ కారిడార్ తరహాలో ఇతర రాష్ట్రాల్లో కూడా ధార్మిక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని ప్రధాని సీఎంలకు చెప్పారు. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు తమతమ ప్రాంతాలలో ప్రణాళికలు రూపొందించి పురాతన, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలను అభివృద్ధికి చొరవ తీసుకోవాలని సూచించారు.

Read Also: Delhi : హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్‌కే మొగ్గు


త్రిపుర, అసోం ప్రభుత్వాలకు ప్రశంసలు..

త్రిపుర ప్రభుత్వం అమలు చేస్తున్న యువర్ డోర్ స్టెప్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రభుత్వ సేవలను ఇళ్ల వద్దకు అందజేసే కార్యక్రమం అభినందనీయమని.. ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించాలని సూచించారు. అసోం ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రభుత్వ ఉపాధి పథకాన్ని ప్రధాని ప్రశంసించారు. గత సంవత్సరాల్లో అస్సాంలో లక్ష ఉద్యోగాలను ఎలా అందించారో ఆ రాష్ట్ర సీఎం ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

Read Also: Delhi : ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లోకి వరద


యూపీ సీఎం ప్రజెంటేషన్..

అక్రమ మైనింగ్‌పై బీహార్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుసరించాలని చెప్పారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ రెండు పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గ్రామ సచివాలయాలను డిజిటలైజేషన్ చేయడం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి సంబంధించిన పథకాలను యోగి వివరించారు. వివిధ రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతూ ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో అమలుచేయాలని మోదీ తెలిపారు.


Read Also: Chennai : తమిళనాట బడ్జెట్‌ సెగలు.. డీఎంకే ధర్నా

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 12:53 PM